ప.గో. జిల్లా: నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వినూత్న నిరసన చేపట్టారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో డబ్బుకొడుతూ... డ్యాన్సులు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడుకు ఆయన మద్దతు పలికారు. నరసాపురం జిల్లా కేంద్రం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని సుబ్బారాయుడు అన్నారు. తమ డిమాండ్లో న్యాయముందన్నారు.
ఇవి కూడా చదవండి