Abn logo
Oct 17 2021 @ 09:34AM

ద్వారకా తిరుమలలో ఘనంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు

ప.గో: ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయంలో అశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామి వారి కోవెల ఉత్సవం జరిగింది. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారి కోవెల ఉత్సవం జరగనుంది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలుచున్నారు. ఈ నెల 15వ తేదీ దసరా రోజున ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 22వ తేదీ వరకు జరుగుతాయి.


18న ఎదుర్కొలు, 19న స్వామివారి కల్యాణం, 20న రథోత్సవం, 22న స్వామివారి పవళింపుసేవతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో ఆర్జిత సేవలు,  ఆర్జిత కల్యాణాలు రద్దు చేసినట్లు ఆలయ ఈవో జివి సుబ్బారెడ్డి తెలిపారు. కరోనా నిబంధనలను పాటిస్తూ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.