ప.గో. జిల్లాలో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం

ABN , First Publish Date - 2021-09-07T16:42:04+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.

ప.గో. జిల్లాలో భారీ వర్షాలు.. స్తంభించిన జనజీవనం

పశ్చిమ గోదావరి జిల్లా: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు పొంగుతున్నాయి. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో  భారీ వర్షాలకు వాగులు, వంకలు  పొంగుతున్నాయి. బ్రిడ్జీలు కుంగుతున్నాయి. రహదారులు గుంటలు పడుతున్నాయి. వందల ఎకరాల  పంట పొలాలు నీటమునిగాయి. కుక్కునూరు మండలం, దాచారం వద్ద గుండేటి వాగు వంతెనపైకి వర్షం నీరు చేరడంతో 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలం ఎద్దు వాగు కాజ్వేపై గోదావరి వరద నీరు చేరింది. దీంతో ఏజెన్సీలో 15 గ్రామాలకు రాకపోకలు నిలచిపోయాయి. భారీ వర్షాలకు లోతు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

Updated Date - 2021-09-07T16:42:04+05:30 IST