ఆ గ్రామంలో ఇంటికో సైనికుడు...

ABN , First Publish Date - 2021-08-15T20:57:30+05:30 IST

ఆ ఊరిలో ఇంటికో సైనికుడు ఉంటాడు. వయసుడిగిన వృద్ధుల నుంచి.. నూనూగు మీసాల యువకుడి వరకు..

ఆ గ్రామంలో ఇంటికో సైనికుడు...

ప.గో.జిల్లా: ఆ ఊరిలో ఇంటికో సైనికుడు ఉంటాడు. వయసుడిగిన వృద్ధుల నుంచి.. నూనూగు మీసాల యువకుడి వరకు అంతా దేశ రక్షణకే అంకితమైన ఊరు. ఇది నిన్న మొన్నటి నుంచి వస్తున్న పరిణామం కాదు. శతాబ్దాల తరబడి ఆ ఊరి ప్రజలు రాజ్య రక్షణలోనూ.. దేశ రక్షణకే అంకితమవుతున్నారు. ప్రతి ఇంటికి ఒక సైనికుడిని తయారు చేస్తున్న ఊరే మాధవరం. ఇది పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లిగూడెంలో ఉంది. అయితే మిలిటరీ మాధవరం అంటేనే అందరికి అర్థమవుతుంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అందిస్తున్న ప్రత్యేక కథనం.

Updated Date - 2021-08-15T20:57:30+05:30 IST