తణుకు: ఆక్సిజన్ లెవెల్స్ లేకపోవడంతో బాధితుడిని చేర్చుకోని వైద్యులు

ABN , First Publish Date - 2021-05-09T17:25:56+05:30 IST

భీమవరం నుంచి కరోనా రోగిని బంధువులు తణుకులో ఓ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే...

తణుకు: ఆక్సిజన్ లెవెల్స్ లేకపోవడంతో బాధితుడిని చేర్చుకోని వైద్యులు

ప.గో.జిల్లా: భీమవరం నుంచి కరోనా రోగిని బంధువులు తణుకులో ఓ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఆక్సిజన్ లెవెల్స్ లేకపోవడంతో వైద్యులు బాధితుడిని ఆస్పత్రిలో చేర్చుకోలేదు.  దీంతో మీరు రమ్మంటేనే వచ్చామని, ఇప్పుడు ఎందుకు చేర్చుకోరని రోగి బంధువులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. బాధితుడిని ఆస్పత్రిలో చేర్చుకోవాల్సిందేనంటూ బంధువులు పట్టుబట్టి రోగిని ఆస్పత్రి బయట  వదిలేశారు. రాత్రంతా రోడ్డుపై అనాధ వ్యక్తిలా ఉన్నాడు. చివరికి అతని పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో  బంధువులు ఆదివారం ఉదయం కాకినాడకు తరలించారు.

Updated Date - 2021-05-09T17:25:56+05:30 IST