సీరియస్‌గా ఉంటే పరీక్షల్లేకుండానే ఆస్పత్రికి..

ABN , First Publish Date - 2020-08-14T12:36:06+05:30 IST

సీరియస్‌ కేసులకు ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండానే ఆసుపత్రికి..

సీరియస్‌గా ఉంటే పరీక్షల్లేకుండానే ఆస్పత్రికి..

కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు 


ఏలూరు(ఆంధ్రజ్యోతి): సీరియస్‌ కేసులకు ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండానే ఆసుపత్రికి తరలించాలని కలెక్టర్‌ ముత్యాలరాజు ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి గురు వారం కొవిడ్‌ - 19పై వీడియో కాన్ఫరెన్సు ద్వారా సబ్‌ కలెక్టర్‌, ఆర్‌డీవో, తహసీల్దార్‌, ఎంపీడీవో అధికారులతో సమీక్షించారు. కొవిడ్‌ లక్షణాలతో సీరియస్‌ అయి ఎవరైనా మరణిస్తే సంబంధిత అధికారులపై తీవ్రమైన చర్యలు ఉంటాయని  హెచ్చరించారు.


జిల్లాలో కొవిడ్‌తో ఒక్క మరణం సంభవించకుండా అధికారులు బాధ్యతగా పని చేయాలన్నారు. కరోనా నియంత్రణకు పాటుపడాలని సూచించారు. వలంటీర్లు ప్రతి రోజు వారికి కేటాయించిన 50 ఇళ్ళకు వెళ్లి ఎవరైనా కొవిడ్‌ లక్షణాలతో ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలన్నారు. లక్షణాలు ఉన్న వారి వివరాలు సురక్ష యాప్‌లో నమోదు చేయాలన్నారు. గ్రామాల వారీ పాజిటివ్‌ కేసుల వివరాలను సురక్ష యాప్‌లో నమోదు చేయాలన్నారు.  ఈ వీడియో కాన్ఫరున్సులో జాయింట్‌ కలెక్టర్‌ (వెల్ఫేర్‌) ఎన్‌ తేజ్‌భరత్‌, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


కరోనాతో కొవ్వూరు ఏఎంసీ చైర్మన్‌ మృతి

కొవ్వూరు: కరోనాతో కొవ్వూరు ఏఎంసీ చైర్మన్‌ యండపల్లి రమేశ్‌బాబు మృతి చెందారు. రమేశ్‌బాబుకు పాజిటివ్‌ రావడంతో హైదరాబాద్‌లో చికిత్సపొందుతూ గురువారం మృతిచెందారు. దీంతో స్వగ్రామమైన కొవ్వూరు మండలం కుమారదేవంలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల ఏఎంసీ మాజీ చైర్మన్‌ బండి పట్టాభిరామారావు, రాష్ట్ర ఎంపీటీసీల చాంబర్‌ మాజీ అధ్యక్షుడు ముదునూరి నాగరాజు తదితరులు సంతాపం తెలిపారు. కొవ్వూరు ఏఎంసీ కార్యాలయంలో కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సంతాపం తెలిపారు.


Updated Date - 2020-08-14T12:36:06+05:30 IST