జల్లేరు వాగు బస్సు ప్రమాదంపై ఆసక్తికర విషయాలు చెప్పిన క్షతగాత్రుడి తండ్రి..

ABN , First Publish Date - 2021-12-17T18:50:43+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో జల్లేరు వాగు బస్సు ప్రమాదంపై క్షతగాత్రుడి తండ్రి సోమశేఖర్‌రెడ్డి ఆసక్తిక విషయాలు తెలియజేశారు.

జల్లేరు వాగు బస్సు ప్రమాదంపై ఆసక్తికర విషయాలు చెప్పిన క్షతగాత్రుడి తండ్రి..

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో జల్లేరు వాగు బస్సు ప్రమాదంపై క్షతగాత్రుడి తండ్రి సోమశేఖర్‌రెడ్డి ఆసక్తిక విషయాలు తెలియజేశారు. ప్రమాద సమయంలో రోడ్డంతా ఖాళీగా ఉందని... ఎటువంటి బైక్ అడ్డం రాలేదన్నారు. కేవలం బస్సు స్టీరింగు పట్టేసిందని.... దీంతో బస్సును కుడివైపు ( రోడ్డు వైపు) తిప్పడానికి డ్రైవర్ చాలా ప్రయత్నం చేశారని తెలిపారు. అయినప్పటికీ సాధ్యం కాకపోవడంతో కొంత దూరం తిన్నగా ముందుకు వెళ్ళి  రైలింగ్‌ను ఢీ కొట్టి వాగులో పడిందన్నారు. ఆపై బస్సులోకి ఆరడుగుల మేరకు నీరు చేరిందని తెలిపారు. డ్రైవర్ నీరు తాగేయడంతో ఊపిరి ఆడకపోవడంతో చనిపోయారన్నారు. తమను  సమీపంలో ఉన్న మత్స్యకారులు, స్థానికులు రక్షించారని సోమశేఖర్‌రెడ్డి తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 10 మంది మరణించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-12-17T18:50:43+05:30 IST