భోగి మంటల సందడి

ABN , First Publish Date - 2021-01-14T05:23:51+05:30 IST

సంక్రాంతి పండుగలో బుధవారం భోగి మంటలను వెలిగించారు.

భోగి మంటల సందడి
పెనుగొండలో భోగి మంట వద్ద సందడి

పాలకొల్లు అర్బన్‌, జనవరి 14: సంక్రాంతి పండుగలో బుధవారం భోగి మంటలను వెలిగించారు. పిడకల దండ మంటలో వేశారు. చిన్నారులకు భోగి పండ్లు వేసి బొమ్మల కొలువులు తీర్చిదిద్దారు.

నరసాపురం టౌన్‌: భోగి పండుగను తీర ప్రాంత ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణం, మండలాల్లో పోటాపోటీగా బోగి మంటలు వేశారు.


ఆచంట: మండలంలోని అన్ని గ్రామాల్లో భోగిమంటలతో సందడి చేశారు. చిన్నారులకు భోగి పండ్లు వేశారు.


కాళ్ళ : మండలంలో భోగి పండుగ సందడిగా సాగింది. గ్రామాల ప్రధాన వీధుల్లో యువత భోగిమంటలు వేశారు.


భీమవరం రూరల్‌ / ఎడ్యుకేషన్‌ : పట్టణంలోని ఎస్‌ఎల్‌వి శివసాయి భద్రగౌరి అపార్ట్‌మెంట్‌లో భోగి మంటలు వేసి, రంగవ ల్లులతో అపార్ట్‌మెంట్‌ను అలంకరించి సంక్రాంతి సంబరాలు అంగ రంగ వైభవంగా బుధవారం నిర్వహించారు. గ్రామాల్లో ప్రధాన వీధుల్లో పెద్ద పెద్దగా భోగి మంటలు వేశారు. చిన్నారులు,  పెద్దలు తెల్లవారు జామునే లేచి తలస్నానం చేసి భోగి మంటలలో భోగి పిడకలు వేశారు. పెద్దలు భోగి మంటకు నమస్కారం చేశారు. 


భీమవరం టౌన్‌: భోగి పండుగ పట్టణంలో ఆనందోత్సవాల మద్య నిర్వహించారు. తెల్లవారుజామునే భోగిమంటలను వెలిగిం చారు. నాచువారి సెంటర్‌లో రెండు కిలోమీటర్ల ఏర్పాటుచేసిన భోగిపిడకల దండ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గునుపూడి ప్రాం తంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం నాచువారి సెంటర్‌లో భోగి మంట వేశారు.


ఉండి : తెల్లవారు జామునుంచి గ్రామాలలో సందడి వాతా వరణం నెలకొంది. ఉండి, యండగండి, మహదేవపట్నం, చిలుకూ రు, చెరుకువాడ, కోలమూరు, పాములపర్రు, పెదపుల్లేరు తదితర గ్రామాల కూడళ్లలో భోగిమంటలను వేశారు.

Updated Date - 2021-01-14T05:23:51+05:30 IST