ఆర్యవైశ్య సంఘ జిల్లా ఉపాధ్యక్షుడిగా బేతాళం

ABN , First Publish Date - 2021-04-11T05:23:59+05:30 IST

జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడిగా కొమ్ము చిక్కాల గ్రామానికి చెందిన బేతాళం సూర్యనారాయణ(సూరిబాబు) నియమితులయ్యారు.

ఆర్యవైశ్య సంఘ జిల్లా ఉపాధ్యక్షుడిగా బేతాళం

పోడూరు, ఏప్రిల్‌, 10 : జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడిగా కొమ్ము చిక్కాల గ్రామానికి చెందిన బేతాళం సూర్యనారాయణ(సూరిబాబు) నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షుడు మహంకాళి రంగప్రసాద్‌  నియామకపత్రం అందించారు. జంగారెడ్డిగూడెంలో ఆదివారం జరగనున్న కార్య క్రమంలో సూర్యనారాయణ బాద్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మండవల్లి దుర్గారావు, సన్నిధి బదరీనారాయణ, బేతాళం రామకృష్ణారావు తదితరులు అభినందనలు తెలిపారు.

Updated Date - 2021-04-11T05:23:59+05:30 IST