ఏలూరులో బ్రహ్మం గారి భక్తుల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-03-18T18:45:48+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా రవ్వలకొండ గుహలను త్రవ్వేస్తున్నారంటూ ఏలూరులో బ్రహ్మం గారి భక్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. 500

ఏలూరులో బ్రహ్మం గారి భక్తుల ఆగ్రహం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా రవ్వలకొండ గుహలను త్రవ్వేస్తున్నారంటూ ఏలూరులో బ్రహ్మం గారి భక్తుల ఆగ్రహం వ్యక్తం చేశారు. 500 ఏళ్ల క్రితం 12 ఏళ్ల పాటు తపస్సు చేసి బ్రహ్మం గారు కాలజ్ఞానం రచించిన పుణ్య ప్రదేశం రవ్వలకొండ అని ఏపీ విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం కన్వీనర్ అప్పలభక్తుల శివశ్రీ  తెలిపారు. ఆ రవ్వలకొండను బాంబులతో పేల్చుతూ మైనింగ్ మాఫియా త్రవ్వేస్తున్నారని ఆరోపించారు. పురావస్తు శాఖ నిబంధనలు మితిమీరి మైనింగ్ మాఫియా త్రవ్వకాలు చేస్తున్నారన్నారు. ప్రపంచంలో ఆంధ్ర రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చిన కాలజ్ఞాని బ్రహ్మం గారు అని తెలిపారు. అలాంటి బ్రహ్మం గారు నడయాడిన ప్రాంతాలను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా గుర్తించి, అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రవ్వలకొండలో అక్రమ మైనింగ్‌ను ప్రభుత్వం అడ్డుకుని, కారకులపై చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే ఛలో రవ్వలకొండ ఉద్యమం చేపడతాం అప్పలభక్తుల శివశ్రీ హెచ్చరించారు. 

Updated Date - 2022-03-18T18:45:48+05:30 IST