ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం ఆగడాల లంక వద్ద రెండు వ్యానుల్లో తరలిస్తున్న 700 కేజీల క్యాట్ ఫిష్‌ను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. వ్యాన్ డ్రైవర్లు భలే రాంబాబు, సైడు యుగంధర్‌లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. క్యాట్ ఫిష్ సరఫరా చేస్తున్న రెండు వ్యానులను సీజ్ చేశారు. పట్టుబడిన క్యాట్ ఫిష్ గుడివాక లంక గ్రామానికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తిదిగా గుర్తించారు.
ఇవి కూడా చదవండి