ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తూర్పులాకుల దగ్గర శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఓ బైక్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఏలూరు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.