తణుకులో అంతర్రాష్ట్ర నేరస్తుడి అరెస్ట్

ABN , First Publish Date - 2022-07-19T18:06:12+05:30 IST

జిల్లాలోని తణుకు పట్టణంలో అంతర్రాష్ట్ర నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తణుకులో అంతర్రాష్ట్ర నేరస్తుడి అరెస్ట్

పశ్చిమగోదావరి: జిల్లాలోని తణుకు పట్టణంలో అంతర్రాష్ట్ర నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న పోతులమూడీ సత్తిబాబు అలియాస్ కుక్కల సత్తిని అరెస్టు చేసినట్లు తణుకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు మీడియాకు వెల్లడించారు. నిందితుడి వద్ద పదహారున్నర  కాసుల బంగారం, హోండా యాక్టివా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ రూ. 3.60 లక్షలు ఉంటుందని అంచనా. మరో మూడు లక్షల విలువైన బంగారు ఆభరణాలను రికవరీ చేయాల్సి ఉందని ఎస్సై వెల్లడించారు. నిందితుడిపై పీడీ యాక్టు అమలు చేయడానికి నివేదించనున్నట్లు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలో నిందితుడిపై సుమారు 20 కేసులు నమోదు ఉన్నాయన్నారు. కేసులో సహకరించిన పట్టణ ఎస్ఐ వీరబాబు, సిబ్బందికి ఎస్సై ఆంజనేయులు అభినందనలు తెలిపారు. 

Updated Date - 2022-07-19T18:06:12+05:30 IST