ఆకివీడులో ఇద్దరు యువకులకు దేహశుద్ధి

ABN , First Publish Date - 2022-04-16T14:11:10+05:30 IST

పశ్చిమగోదావరి ఆకివీడులో ఇద్దరు యువకులకు కృష్ణా జిల్లాకు చెందిన పెళ్లి బృందం దేహశుద్ధి చేసింది.

ఆకివీడులో ఇద్దరు యువకులకు దేహశుద్ధి

ప.గో: పశ్చిమగోదావరి ఆకివీడులో ఇద్దరు యువకులకు కృష్ణా జిల్లాకు చెందిన పెళ్లి బృందం దేహశుద్ధి చేసింది. అన్నవరంలో పెళ్లి చేసుకుని తిరుగు ప్రయాణంలో వస్తుండగా ఆకివీడులో పెళ్లి కుమార్తె పట్ల  బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పెళ్లి బృందం సభ్యులు... యువకులను పట్టుకుని ఆకివీడు సెంటర్‌లో దేహశుద్ధి చేశారు. 

Updated Date - 2022-04-16T14:11:10+05:30 IST