అమ్మో..పులి పిల్లలా..!?

ABN , First Publish Date - 2021-01-27T05:33:00+05:30 IST

పత్తి పంట తీసేందుకు పొలం వెళ్లిన రైతులకు పులి చారలతో కూడిన పిల్లలు కనపడడంతో బెంబేలెత్తిపోయారు.

అమ్మో..పులి పిల్లలా..!?

కుక్కునూరు, జనవరి 26 : పత్తి పంట తీసేందుకు పొలం వెళ్లిన రైతులకు పులి చారలతో కూడిన పిల్లలు కనపడడంతో బెంబేలెత్తిపోయారు. దీంతో రైతులు, కూలీలు పులి పిల్లలంటూ భయంతో వెనుదిరిగారు. కుక్కునూరు మండలం ఉప్పరి మద్దిగట్లలోని ఒక రైతు పత్తి తోటలో మంగళవారం పత్తి పంట తీయడానికి కూలీ లతో కలిసి వెళ్లిన సమయంలో ఇవి కనిపించాయి. ఇటీవల కాలంలో ఆ ప్రాంతంలోనే పులి సంచరించిన ఆనవాళ్లు కనపడడంతో స్థానికులు కూడా పులి పిల్లలంటూ ఆందోళన చెందారు. స్థానికంగా దీనిపై విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే  విషయం తెలుసుకున్న అటవీ అధికా రులు ఆ కూనలను పరిశీలించి అవి అడవి జాతికి చెందిన పిల్లి పిల్లలని గుర్తించారు. 


Updated Date - 2021-01-27T05:33:00+05:30 IST