రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం

ABN , First Publish Date - 2022-09-29T05:28:42+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై అఖిల భారత అగ్రగామి కిసాన్‌ సభ పోరాటాలు సాగిస్తోందని ఫార్వర్డ్‌ బ్లాక్‌ జాతీయ కార్యదర్శి జ్యోతిరంజన్‌ మహాపాత్ర అన్నారు.

రైతు వ్యతిరేక విధానాలపై పోరాటం
మాట్లాడుతున్న నూతన అధ్యక్షుడు కృష్ణమూర్తి

 ఫార్వర్డ్‌ బ్లాక్‌ జాతీయ కార్యదర్శి జ్యోతిరంజన్‌ మహాపాత్ర


భీమవరం అర్బన్‌, సెప్టెంబరు 28 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై అఖిల భారత అగ్రగామి కిసాన్‌ సభ పోరాటాలు సాగిస్తోందని ఫార్వర్డ్‌ బ్లాక్‌ జాతీయ కార్యదర్శి జ్యోతిరంజన్‌ మహాపాత్ర అన్నారు. భీమవరం ఆనంద ఫంక్షన్‌హాలో నిర్వహిస్తున్న అఖిల భారత అగ్రగామి కిసాన్‌ సభ రాష్ట్ర మహాసభలు బుధవారం లంక కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగాయి. సభలకు ముఖ్యఅతిఽథిగా విచ్ఛేసిన జ్యోతిరంజన్‌ మహాపాత్ర, ఏఐఏకేఎస్‌ జాతీయ కమిటీ సభ్యుడు ఏఏ రామరాజు మాట్లాడుతూ దేశంలో రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. మొత్తం18 జిల్లాల నుంచి 130 మంది ప్రతినిధులు పాల్గొని పలు తీర్మానాలు చేశారు. అనంతరం తొమ్మిది మంది కార్యదర్శి వర్గంగాను, 23 మంది నూతన రాష్ట్ర కమిటీగా ఈ మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఏఐ ఏకేఎస్‌ నూతన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా లంక కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడిగా ఎం. వ్రీరామరాజు, డి.చంద్రశేఖర్‌, సూర్యానారాయణ, ప్రధాన కార్యదర్శిగా గాదిరాజు ప్రసాదరాజు, కార్యదర్శులుగా రామినేని రాజు నాయుడు, ఎస్‌. మహేశ్వరరాజు, బి. జగదీశ్వరరెడ్డి, రాగుల రవణ ఎన్నికయ్యారు. ఏఐఏకెఎస్‌ జాతీయ కార్యదర్శి పీవీ సుందరరామరాజు, రైతు కార్యచరణ సమితి కార్యదర్శి జీ. నాగేశ్వరరాజు, నాయకులు  తమ్మినీడి నాగేశ్వరరావు, నల్లం నాగేశ్వరరావు, పీ. రామకృష్ణంరాజు, దండు శ్రీనివాసరాజు, వెంకటపతి రాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-29T05:28:42+05:30 IST