అదుపుతప్పిన మోటార్‌ సైకిల్‌.. బాలుడి మృతి

ABN , First Publish Date - 2021-01-14T05:07:43+05:30 IST

మోటారు సైకిల్‌ అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో బాలుడు మృతిచెందాడు.

అదుపుతప్పిన మోటార్‌ సైకిల్‌.. బాలుడి మృతి

భీమడోలు, జనవరి 13 : మోటారు సైకిల్‌ అదుపుతప్పి రోడ్డుపై పడిపోవడంతో బాలుడు మృతిచెందాడు.పోలసానపల్లి కొత్త కాలనీలో గ్యాస్‌ స్టౌవ్‌లు మరమ్మతులు చేసుకునే పఠాన్‌ వలీ ఇద్దరు కుమారులు పఠాన్‌ రఫీ, పఠాన్‌ అలీ భీమడోలు వైపు ద్విచక్ర వాహనంపై వెళుతూ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయారు. ఇద్దరిలో చిన్నవాడైన పఠాన్‌ అలీ (12) తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడు భీమడోలు హైస్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నాడు.  భీమ డోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-01-14T05:07:43+05:30 IST