నిజం గొంతు నొక్కుతారా.. !

ABN , First Publish Date - 2021-01-21T05:03:59+05:30 IST

రాష్ట్రంలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానల్‌ ప్రసారాలు నిలిపి వేయడంపై నల్లజర్ల మండలం జగన్నాథపురం, గంటావారిగూడెం గ్రామస్థులు ఆందోళనకు దిగారు.

నిజం గొంతు నొక్కుతారా.. !
జగన్నాధపురంలో గ్రామస్థులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్న బాపిరాజు,ముప్పిడి

ఏబీఎన్‌ ప్రసారాలు నిలిపివేతపై ఆందోళన 

రెండు గ్రామాల ప్రజల ర్యాలీ

తాడేపల్లిగూడెం/ నల్లజర్ల జనవరి 20  : రాష్ట్రంలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానల్‌ ప్రసారాలు నిలిపి వేయడంపై నల్లజర్ల మండలం జగన్నాథపురం, గంటావారిగూడెం గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ర్యాలీలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఏబీఎన్‌ ప్రసారాలను పునరుద్ధరించాలంటూ రెండు గ్రామాల ప్రజలు మూకుమ్మడిగా సంతకాల సేకరణ జరిపారు.  కేబుల్‌ నెట్‌ వర్క్‌ నిర్వాహకులకు 48 గంటల అల్టిమేటం జారీ చేశారు. అప్పటిలోగా పునరుద్ధరిం చకపోతే అన్ని ఛానల్స్‌ను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. గంటావారి గూడెంలో 600 కనెక్షన్‌లు ఉంటే 500 మంది ఏబీఎన్‌ ప్రసారాలను పున రుద్ధరించాలంటూ సంతకాలు చేశారు. అలాగే జగన్నాథపురంలో 400 కనెక్షన్లలో 300 మంది సంతకాలు చేసి స్థానిక కేబుల్‌ నెట్‌ వర్క్‌ నిర్వాహకులకు వినతి పత్రం ఇచ్చారు. తొలుత రెండు గ్రామాల ప్రజలు ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ ముళ్లపూడి బాపిరాజు, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావులు నిరసనకు సంఘీభావం తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. రెండు కిలో మీటర్ల ర్యాలీ కొనసాగింది. మీడియా గొంతునొక్కి నిజాలను సమాధి చేస్తారా అంటూ నినదించారు.  తక్షణమే ఏబీఎన్‌, టీవీ–5 ప్రసారాలు పునరిద్ధరించాలంటూ నినాదాలు చేశారు. జగన్నాథపురంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద  ధర్నా నిర్వహించి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ ముమ్మడి సత్యనారాయణ, మండల తెలుగుదేశం అధ్యక్షుడు తాతిన సత్యనారాయణ, మాజీ ఎంపీపీ జమ్ముల సతీష్‌, మాజీ సర్పంచ్‌ మల్లిపూడి కృష్ణారావు, జానాపురం మాజీ సర్పంచ్‌ గొడుగు బాబూరావు, ఎస్సీ సెల్‌ మాజీ అధ్యక్షుడు గుదే సుబ్బారావు, విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఉప్పు నరేష్‌, బీసీ సెల్‌ అధ్యక్షుడు మైనం చంద్రశేఖర్‌, ఎస్‌సి సెల్‌ అధ్యక్షుడు మానుకొండ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.


రాష్ట్రంలో  రాజారెడ్డి రాజ్యాంగం :ముళ్లపూడి బాపిరాజు, మాజీ జడ్పీ చైర్మన్‌ 

అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం రాష్ట్రంలో అమలు జరగడం లేదు. పులి వెందుల రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరుగుతోంది. విద్యుత్‌ స్తంభాలపై ఉన్న కేబుల్‌ నెట్‌ వర్క్‌ వైర్‌లను కట్‌ చేస్తామంటూ ఒత్తిడి తెచ్చి ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఛానల్స్‌ ప్రసారాలను ప్రభుత్వం నిలిపివేయించింది. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయడమే. 


అన్ని ఛానల్స్‌ను నిలిపివేస్తాం :ముప్పిడి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే 

రాష్ట్రంలో నిరంకుశ పాలన నడు స్తోంది. ప్రభుత్వం చేస్తున్న దుర్మా ర్గాలు, అక్రమాలను వెలికి తీస్తు న్నారని ఏబీ ఎన్‌ ప్రసారాలు నిలిపివే శారు. ఏబీఎన్‌, టీవీ5 ఛానల్స్‌ను పునరుద్ధరించకపోతే గోపాలపురం నియోజకవర్గంలో అన్ని ఛానల్స్‌ను నిలిపివేస్తాం. 


రాజ్యాంగ విలువలు కాలరాయడమే : కిలారు సత్యనారాయణ, కామవరపుకోట

మీడియా గొంతు నొక్కడం అంటే అంబేడ్కర్‌ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడమే..ఇది అప్రజా స్వామికం.. మీడియా జోలికి రావడం అంటే కూర్చున్న కొమ్మను నరుక్కో వడమే.. గతంలో ఏబీఎన్‌ చానల్‌ ప్రసారాలను నిలిపివేసిన నాయకులకు శృంగభంగం జరిగినట్టే ఈ పాలకులకూ ప్రజలు బుద్ధి చెబుతారు. ఈ చర్యలను టీడీపీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం.


మీడియా గొంతు నొక్కుతున్న ప్రభుత్వం : టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యాం చంద్రశేషు

రాష్ట్రప్రభుత్వం అబద్దపు పునాదుల మీద నడుస్తున్నది. ఫోర్త్‌ ఎస్టేట్‌గా పిలవబడే మీడియా గొంతునొక్కడానికి ఈ ప్రభుత్వం ప్రయ త్నం చేస్తున్నది. మీ పద్ధతులు మార్చు కోకపోతే భవిష్యత్‌ అంథకారమే అవుతుంది.


ప్రసారాలను పునరుద్ధరించాలి : పాముల శ్రీను, టీడీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌, నల్లజర్ల

రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నారన్న కక్షతోనే ఏబీఎన్‌   ప్రసారాలను నిలిపివేశారు. ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ఏబీఎన్‌ ఆంధ్ర జ్యోతి ప్రసారాలను పునరుద్ధరించాలి. నిరంకుశ వైఖరిని విడనాడాలి.


నిరంకుశ పాలనకు నిదర్శనం : మైనం వెంకటలక్ష్మి, టీడీపీ మహిళా కార్యకర్త, నల్లజర్ల

ఏబీఎన్‌ ప్రసారాలను నిలిపివేయడం ప్రభు త్వ నిరంకుశ పాలనలో భాగమే. మహిళలను కూడా వేధింపులకు గురిచేసే ప్రభుత్వ మిది. ప్రభుత్వం చేసే చెడు ప్రజలకు తెలియ కుండా ఉండాలని ప్రసారాలను నిలిపివేశారు.ఇది మంచి పద్ధతి కాదు. తక్షణమే ప్రసారాలను పునరుద్ధరించాలి.




Updated Date - 2021-01-21T05:03:59+05:30 IST