Abn logo
Jan 25 2021 @ 00:27AM

గ్రామ ‘పంచాయితీ’ తేలేనా..!

నేటి సుప్రీం నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

 వేచి చూస్తున్న అధికార యంత్రాంగం

 తొలి విడత ఏలూరు డివిజన్‌ ఎన్నికలు 

 నేటి నుంచే నామినేషన్ల ప్రక్రియ

 కార్యాలయాల్లో కనిపించని హడావుడి

 అన్ని పార్టీల్లోనూ వ్యూహ ప్రతి వ్యూహాలు 


(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరి పం తం నెగ్గుతుందనే దానిపై ఎవరికి వారు దృష్టి సారించా రు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు చేతులెత్తేసినం త పనిచేయగా అదే మార్గంలో అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. తొలి దశ పంచాయతీ ఎన్నికలకు వీలుగా శని వారం నోటిఫికేషన్‌ విడుదల కాగా సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ఆరంభం కావాల్సి ఉంది. అధికార యంత్రాంగం వీటికి సంబంధించిన వివరాలు వెల్లడించేం దుకు, నామినేషన్లు స్వీకరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నదీ తెలియడం లేదు. వాస్తవానికి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ స్వయంగా వివరాలు వెల్లడించాలి. ఎక్కడి కక్కడ మండల అధికారులు ఈ ఆదేశాలకు అనుగుణం గా యంత్రాంగాన్ని అప్రమ త్తం చేయాలి. వివిధ రాజకీ య పక్షాలు అడిగే సమా చారాన్ని అందించాలి. ఇప్పు డా పరిస్థితి లేదు. పంచా యతీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ అయినా యంత్రాంగం చడీ చప్పుడు చేయలేదు. ఉన్నతాధికా రులు మౌనం దాల్చారు. ఎన్నికల కోడ్‌ ను అమలు చేయాల్సిన మండలస్థాయి అధికా రులు పట్టనట్లు ఉన్నారు. కొన్ని మండలాల అధికారులు మాత్రమే పంచాయతీ ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిం దని క్షేత్రస్థాయి సిబ్బందిని పరోక్షంగా అప్రమత్తం చేశారు. కానీ ఎలాంటి సమావేశాలు పెట్టి వివరించలేదు. జిల్లా పంచాయతీ అధికారి దగ్గర నుంచి మిగిలిన అధికారులు ఈ తతంగానికి దూరంగా ఉన్నారు. వీరంతా రాష్ట్ర ప్రభు త్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య జరుగుతున్న వార్‌లో ప్రస్తుతానికి ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. ఎన్నికల వ్యవ హారం సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున తదను గుణంగా తీర్పు కోసమే యంత్రాంగం వేచి చూస్తోంది. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తరువాత అది నామినేషన్‌ ప్రక్రియ ఆరంభమైన తరువాత ఈ విషయాల్లో న్యాయస్థానాలు ఆచితూచి వ్యవహరిస్తాయి. ఇప్పుడు అదే తరహాలో నిర్ణయం ఉంటుందని ప్రతిపక్షాలు భావిస్తుండగా అధికార పక్షం మాత్రం ఎన్నికలు వాయిదా పడితీరుతాయన్న ధీమాతో ఉంది. 


పార్టీలు.. వ్యూహాలు

ఎన్నికలు జరుగుతాయా ? లేదా ? అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుండగానే వివిధ పక్షాలు తమ వ్యూహా లకు పదును పెట్టాయి. అధికార వైసీపీ తొమ్మిది నెలల క్రితమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై దాదాపు ఒక నిర్ణయానికి వచ్చింది. తగ్గట్టుగానే పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసింది. కరోనాతో అప్పట్లో ఎన్నికల ప్రక్రియ వాయిదా పడి ఇప్పుడు తిరిగి ఎన్నికల నిర్వహ ణకు ప్రయత్నాలు జరుగుతుండగా పాత అభ్యర్ధుల జాబి తాలనే తిరగతోడుతున్నారు. అధికారపక్ష ఎమ్మెల్యేలు సైతం ‘ఎన్నికలు తప్పవనుకుంటే పోటీకి సిద్ధపడాలి.  అందరితో టచ్‌లో ఉండం డి’ అంటూ ఇప్పటికే ఖరా రైన అభ్యర్థులను సూచన లు జారీచేశారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అభ్యర్థుల ఖరారులో కూడికలు తీసివేతలకు దిగుతున్నారు. మేజర్‌ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులకు ఇప్పటికే ఖరారైన అభ్యర్థుల్లో పది శాతం మంది అభ్యర్థులు మారే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. 


టీడీపీ ప్రధాన దృష్టి

ఇకపోతే మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరు, కొవ్వూరు, ఆచంట నియోజకవర్గాలపై తెలుగుదేశం దృష్టి పెట్టింది. ఇంతకు ముందే ఆయా గ్రామాల సర్పంచ్‌ల పదవుల కోసం అభ్యర్థులను ఖరారు చేసి జాబితాను సిద్ధం చేసుకుంది. ఇప్పుడా జాబితాను యఽథాతథంగా కొనసాగిం చాలా.. కొత్త ముఖాలు రంగంలోకి దిగితే ఆహ్వానించాలా అనే దానిపై స్థానిక అభిప్రాయాలు స్వీకరిస్తున్నారు. ఆచం టలో మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్‌, ఏలూరులో టీడీపీ కన్వీనర్‌ బడేటి చంటి అభ్యర్థుల అన్వేషణ, ఖరారులో ముందు వరుసలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు మాధవనాయుడు, ఆరిమిల్లి రాధాకృష్ణ, గన్ని వీరాంజనేయులు,  ముప్పిడి వెంకటేశ్వర రావు, ఈలి నాని, బూరుగుపల్లి శేషారావు, చింతమనేని ప్రభాకర్‌తోపాటు ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, కన్వీనర్లు రాజారావు, బొరగం శ్రీనివా సరావు వంటి వారంతా టీడీపీ కార్యకర్తలతో మంతనాలు సాగిస్తున్నారు. ఇప్పటికే అంతర్గత సమావేశం జరిగింది. బీజేపీ, జనసేన ఎవరంతటికి వారుగా వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల జనసేన, టీడీపీ మద్దతుతో పోటీకి దిగాలని యోచిస్తోంది. సర్పంచ్‌ ఎన్నికలు పార్టీ రహితంగా జరుగు తున్నా లోపాయికారిగా మాత్రం పార్టీల జోక్యం ఉండనే ఉంటుంది. రిజర్వేషన్లు ఎలాగూ ఇప్పటికే ఖరారైనందున ఇంకోవైపు అధికారపక్ష ఒత్తిళ్లకు ఏ మాత్రం బెదరకుండా కొందరు పోటీకి సిద్ధపడుతున్నట్లు చెబుతున్నారు. 


కొత్త ఓటర్లకు నో చాన్స్‌..! 

 35 వేల మంది పంచాయతీ ఎన్నికలకు దూరం

 2019 ప్రకారం 23,76,736 మందికే ఓటు హక్కు

ఏలూరు, జనవరి 24(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి ఓటేయాలన్న ఆశతో ఎదురుచూస్తున్న కొత్త ఓటర్లను తాజా నోటిఫికేషన్‌ నిరాశ పరిచింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త ఓటర్లకు ఛాన్స్‌ ఇచ్చినా పంచాయతీరాజ్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయారు. తాజా జాబితా లేకపోవడంతో 2019 నాటి జాబితానే ప్రామాణికంగా తీసుకుంటున్నట్లు ఎన్నికల సంఘం తాజా నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఫలితంగా జిల్లాలో సుమారు 35 వేల మంది కొత్త ఓటర్లు అవకాశాన్ని కోల్పోయారు. గత జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం 2019 ఎన్నికల జాబితాను ప్రామాణికంగా తీసుకుంది. ఈ జాబితా ప్రకారం జిల్లాలోని 900 పంచాయతీలకు 24,17,567 మంది ఓటర్లు ఉన్నారు. తాజా నోటిఫికేషన్‌లో ఈ జాబితా 23,76,736కి తగ్గింది. వీటితోపాటు ఐదు గ్రామ పంచాయతీలను మినహాయిం చడంతో 40 వేల మంది పంచాయతీ ఎన్నికలకు దూరమ య్యారు. జిల్లాలోని చింతలపూడి పంచాయతీ నగర పంచాయతీగా అప్‌గ్రేడ్‌ కావడంతో 21,446 మంది, భీమవరం మున్సిపాలిటీలో విలీనం కానున్న తాడేరు, రాయలం, చిన అమిరం, కొవ్వాడ అన్నవరం పంచాయతీల ఓట ర్లు మరో 20 వేల మంది ఎన్నికలకు దూరం కానున్నారు. జనవరి 15న జిల్లా ఎన్నికల అధికారి విడుదల చేసిన తాజా ఎన్నికల జాబితాలో జిల్లా ఓటర్ల సంఖ్య ఈ ఏడాది 32.4 లక్షల నుంచి 33 లక్షల 02 వేలకు పెరిగింది. అంటే ఏడాది కొత్తగా 52,510 మంది ఓటు హక్కు పొందారు. డిసెంబ రులో విడుదల చేసిన ముసాయిదా జాబితా ప్రకారం జిల్లాలోని మొత్తం ఓటర్ల సంఖ్య 32,59,135 కాగా చివరి నెలలో దాదాపు 40 వేల మంది ఓటు హక్కు పొందారు. ఒక్క నెలలో అనూహ్యంగా ఓటర్లు పెరగడానికి గల ప్రధాన కారణం ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త వారికి ఛాన్స్‌ ఇస్తున్నట్లు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ప్రకటించడమే. ప్రస్తుత జాబితా ప్రకారం జిల్లాలో గ్రామీణ ఓటర్ల సంఖ్య 24.15 లక్షలకు పెరిగింది. తాజాగా ఓటు హక్కు పొందిన వారిలో సుమారు 35 వేల మందికిపైగా గ్రామీణ ప్రాంత ఓటర్లే ఉన్నారు. తాజా పరిణామాల రీత్యా వీరంతా పంచాయతీ ఎన్నికలకు దూరం కానున్నారు.


Advertisement
Advertisement
Advertisement