ఏలూరు: ఇద్దరు మహిళలకు కరోనా...గ్రామంలో ఉండొద్దంటూ వైసీసీ నేతల ఒత్తిడి

ABN , First Publish Date - 2020-08-08T17:10:29+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం క్రొవ్విడిలో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని ఇద్దరు మహిళలకు కరోనా

ఏలూరు: ఇద్దరు మహిళలకు కరోనా...గ్రామంలో ఉండొద్దంటూ వైసీసీ నేతల ఒత్తిడి

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు మండలం క్రొవ్విడిలో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని ఇద్దరు మహిళలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని  గ్రామంలో ఉండనివ్వకుండా శ్మశానానికి తరలించాలంటూ  వైసీపీ నాయకులు ఒత్తిడి తీసుకువచ్చారు. వారి ఒత్తిడితో ఆరోగ్య శాఖ సిబ్బంది ఇద్దరు మహిళలను శ్మశాన వాటికలో ఉంచారు. నిన్న ఉదయం నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు వారిరువురిని శ్మశానవాటికలోనే ఉంచారు. ఆహారం, తాగడానికి నీరు లేక బాధితులు విలవిలలాడారు. ఈ అవమానం భరించలేక ఒక బాధితురాలు పక్కనే ఉన్న వెంకయ్య వయ్యేరు కాల్వలోకి దూకేందుకు రెండు సార్లు ప్రయత్నించగా... బంధువులు అడ్డుకున్నారు. చివరకు రాత్రి తొమ్మిది గంటల సమయంలో బాధితులను తాడేపల్లిగూడెం కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2020-08-08T17:10:29+05:30 IST