ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయంలో సుదర్శన హోమం వైభవంగా నిర్వహించారు. ఈరోజు ఉదయం ఉత్సవమూర్తులకు అభిషేకం, అగ్నిప్రతిష్ఠాపన చేశారు. సాయంత్రం అగ్ని ఆరాధన, సహస్ర సంఖ్యాక సుదర్శన హోమాన్ని నిర్వహించనున్నారు. కొవిడ్ నిబంధనలను అనుసరిస్తూ హోమాన్ని వీక్షించేందుకు ఆలయ అధికారులు భక్తులకు అనుమతినిచ్చారు. మరోవైపు నేటి నుంచి ఈ నెల 23 వరకు వెంకన్న ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి నిత్యార్జిత కళ్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు.