తూ.గో. జిల్లాలో పోటెత్తుతున్న వరదలు

ABN , First Publish Date - 2021-06-25T17:32:37+05:30 IST

తూ.గో.: జిల్లాలో వరదలు పోటెత్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో..

తూ.గో. జిల్లాలో పోటెత్తుతున్న వరదలు

తూ.గో.: జిల్లాలో వరదలు పోటెత్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో పోలవరం ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. కాఫర్ డ్యామ్ నీటి మట్టం పెరగడంతో ముంపు గ్రామాల్లోకి వరద నీరు ప్రవహిస్తోంది. వరద నీరు భారీగా ప్రవహించడంతో దేవీపట్టణం మండలంలోని 30 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చినరమనయ్యపేట, దండంగి గ్రామాల మధ్య రహదారిపై సీతపల్లి వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలు నాటు పడవలపై మైదాన ప్రాంతాలకు తరలిపోతున్నారు.

Updated Date - 2021-06-25T17:32:37+05:30 IST