ఆనందం.. ఆక్రోశం

ABN , First Publish Date - 2021-05-06T05:51:13+05:30 IST

జిల్లాలో రబీ వరి మాసూళ్లు చివరి అం కంలో ఉన్నాయి. 80 శాతం మాసూళ్లు జరిగాయి.

ఆనందం.. ఆక్రోశం

 రబీలో 80 శాతం మాసూళ్లు పూర్తి

 అధిక దిగుబడులపై రైతుల ఆనందం.. 

 ఆర్‌బీకేల్లో ధాన్యం విక్రయాలపై ఆందోళన 

 కరోనా వేళ.. రిజిస్ట్రేషన్‌ పాట్లు

 దళారుల దందా.. కొమ్ము కాస్తున్న మిల్లర్లు 


జిల్లాలో రబీ వరి మాసూళ్లు చివరి అం కంలో ఉన్నాయి. 80 శాతం మాసూళ్లు జరిగాయి. ఈ సారి దిగుబడులు ఆశాజనకంగానే ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కానీ, అంతలోనే అయితే రైతు కొనుగోలు కేంద్రాల్లో మాత్రం ధాన్యం విక్రయానికి ఇబ్బందులు పడుతున్నారు. సంచులు దొరక్క, గిట్టుబాటు ధర ఇచ్చేందుకు వేస్తున్న కొర్రీలతో దళారులు, మిల్లర్ల మధ్య అన్నదాతలు నలిగిపోతున్నారు. 

(భీమవరం/తాడేపల్లిగూడెం రూరల్‌):  మాధవరంలో ఓ రైతు 15 ఎకరాల్లో వరి పం డించాడు. ధాన్యాన్ని నవాబుపాలెం సొసైటీకి తర లించాలని చూశాడు. కానీ, మిల్లర్ల దగ్గర నుంచి సంచులు తెచ్చుకుని, వారు అనుమతిస్తేనే ధాన్యం తూయాలని వ్యవసాయాధికారులు చెప్పారు. వారి ని సంప్రదిస్తే అన్నీ బాగుంటే 75 కేజీల ధాన్యానికి రూ.1400 తీసుకుంటాం. అదీ మిల్లుకు పంపిస్తేనే అని సమాధానం వచ్చింది. చేసేది లేక రైతు తన ధాన్యాన్ని మిల్లుకు చేర్చేందుకు బస్తాకు రూ.60 ఖర్చు చేశాడు. 

మరి మిల్లర్ల వరకూ వెళ్లలేని సన్న చిన్న కారు రైతుల పరిస్థితి ఎలా ఉందంటే.. దళారులు ఇచ్చిం ది తీసుకోవడం తప్ప మరో దారి లేదు. ధాన్యం కొనుగోలు విషయంలో ఇటు మిల్లర్లను, మరోవైపు దళారులను కట్టడి చేసే విషయంలో ప్రభుత్వం విఫలమవుతోంది. తాడేపల్లిగూడెం మండలంలోని ఓ గ్రామంలో వైసీపీ నాయకులు వారి ధాన్యం తూసేందుకు సాక్షాత్తూ ఎమ్మెల్యేను అడిగి సంచు లు తెప్పించుకున్నారు.  ఒక సొసైటీ ఆధ్వర్యంలో నో, లేక ఐకేపీ కొనుగోలు కేంద్రంలోనో ధాన్యం తూయాలంటే మిల్లర్లు పెడుతున్న మెలి అంతా ఇంతా కాదు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో సరి పడా మోయిశ్చర్‌ కంటెంట్‌ వచ్చిన ధాన్యం మిల్లర్ల దగ్గరకు వెళ్లే సరికి ఏదో సాకు చూపి వెనక్కి పంపిస్తున్నారు. దళారుల దగ్గర నుంచి ధాన్యం పంపిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండటం లేదు. ఈ తల నొప్పులు భరించలేక రైతులు దళారులను ఆశ్రయించి ధాన్యం అమ్ముకుంటున్నారు. పొలం ఉన్న రైతులు ఆర్‌బీకేల్లో అనుమతి పత్రం తీసు కుని సొసైటీల వద్ద కానీ, ధాన్యం కొనుగోలు కేం ద్రాల వద్ద గాని ధాన్యం విక్రయించేందుకు సం చు లు తీసుకోవాలి. అయితే ఎక్కడా సంచులు లేవు. ఎక్కడైనా సంచులు వచ్చినా ఐకేపీ ధాన్యం కొను గోలు కేంద్రాల నిర్వాహకులు దళారులతో చేతులు కలిపి ఆ సంచులు దళారులకు అప్పగిస్తున్నారు.


ఆర్‌బీకేల్లో ఇబ్బందులు

రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం అమ్ముకునేం దుకు రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. జిల్లాలో గత నెల 6న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. 195 సహకార సంఘాలు, 205 ఐకేపీ కేంద్రాలలో ధాన్యం కొంటున్నారు. ఎక్కడికి రైతులు ధాన్యం తీసుకురావాలంటే కచ్చితంగా రైతు భరోసా కేంద్రాలకు వెళ్లాలి. ప్రస్తుతం ఆర్‌బీకే సిబ్బందికి ప్రభుత్వం ఇతర కరోనా బాధ్య తలను అప్పగించింది. దీంతో వారు ఆ పనితో పాటు రైతుల పేర్ల నమోదులో బిజీగా ఉన్నారు. ఈ కారణంగా భీమవరం పరిసర ప్రాంతాల్లో వారు రాకపోవడంతో రైతులు ఇబ్బందులు పడు తూ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. దీనికితోడు గ్రామీణ ప్రాంతాలలో సర్వర్‌ సమస్య ఇబ్బందులు పెడుతూనే ఉంది. గతంలో ఒకసారి తమ వివరాలను నమోదు చేస్తే దీర్ఘకాలంపాటు అవి ఫోర్సులో ఉండేవి. ఇప్పుడు ప్రతి పంట నమోదు చేయాలన్న ఆదేశాలతో ఇబ్బందులు పడబుతున్నారు. దీనిని రద్దు చేయాలంటున్నారు. పాత విధానాన్ని అమలు చేస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదని రైతులు వాపోతున్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అందిన వెంటనే 48 గంటల్లో  నగదు బ్యాంకులో జమ య్యేది. ఈసారి 15 రోజుల వరకు ధాన్యం బిల్లు బకాయిలు చెల్లించలేమని అధికారులు ప్రకటించడంతో రైతులు విస్తుపోతున్నారు.  


Updated Date - 2021-05-06T05:51:13+05:30 IST