bengal ssc scam: ఆ డబ్బు నాది కాదు, నేను లేనప్పుడు ఎవరో పెట్టారు: అర్పితా ముఖర్జీ

ABN , First Publish Date - 2022-08-02T22:59:26+05:30 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కుంభకోణంలో (teacher recruitment scam) మాజీ మంత్రి పార్థా ఛటర్జీ (partha chatterjee) సహాయకురాలు అర్పితా ముఖర్జీ

bengal ssc scam: ఆ డబ్బు నాది కాదు, నేను లేనప్పుడు ఎవరో పెట్టారు: అర్పితా ముఖర్జీ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కుంభకోణంలో (teacher recruitment scam) మాజీ మంత్రి పార్థా ఛటర్జీ (partha chatterjee) సహాయకురాలు అర్పితా ముఖర్జీ (arpitha mukherjee) తాజాగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.  తన నివాసంలో దొరికిన కోట్ల రూపాయల నోట్ల కట్టలు, కేజీల కొద్దీ బంగారం నగలు తనవి కాదని, తాను లేనప్పుడు ఎవరో తన ఫ్లాట్లలో పెట్టి ఉంటారని ఆమె ఆరోపించారు. వైద్య పరీక్షల కోసం అర్పితాను ఈడీ అధికారులు ఆసుపత్రికి మరోసారి తీసుకువచ్చిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 


మరోవైపు శాంతినికేతన్‌లో 2012లో 20 లక్షలకు కొనుగోలు చేసిన ఫామ్ హౌస్‌ను పార్థా చటర్జీ అర్పితకు రాసిచ్చేశారు. ఇది ఈడీ దాడుల్లో వెలుగులోకివచ్చింది. ఈ ఫామ్‌హౌస్‌కు అపా అని పేరు పెట్టారు. అ అంటే అర్పిత, పా అంటే పార్థా చటర్జీ అని అర్థం వచ్చేలా పేరు పెట్టారు. తరచూ ఇద్దరూ ఈ ఫామ్‌హౌస్‌కు వస్తుంటారని స్థానికులు తెలిపారు. అర్పిత పేరిట ఉన్న అనేక ఆస్తులకు సంబంధించిన పత్రాలు ఈ ఫామ్‌హౌస్‌లోనే ఈడీ అధికారులకు దొరికాయి. 


అటు అర్పితా ముఖర్జీ ఫ్లాట్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ దాడుల్లో ఇప్పటివరకూ 50 కోట్ల రూపాయలకు పైగా అక్రమ నగదు బయటపడింది. ఐదు కిలోల బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు అర్పితా ముఖర్జీకి చెందిన నాలుగు కార్లు అదృశ్యమయ్యాయి. ఆ కార్ల నిండా నోట్ల కట్టలున్నాయని సమాచారం. 



Updated Date - 2022-08-02T22:59:26+05:30 IST