పశ్చిమ బెంగాల్‌లో రామ పూజకు ఏర్పాట్లు చేస్తున్న బీజేపీ కార్యకర్తల అరెస్ట్

ABN , First Publish Date - 2020-08-05T20:32:49+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నపూర్ జిల్లాలో రామ పూజకు ఏర్పాట్లు చేస్తున్న

పశ్చిమ బెంగాల్‌లో రామ పూజకు ఏర్పాట్లు చేస్తున్న బీజేపీ కార్యకర్తల అరెస్ట్

మిడ్నపూర్ : పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నపూర్ జిల్లాలో రామ పూజకు ఏర్పాట్లు చేస్తున్న జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి శంకర్ గుచెయిత్, ఇతర బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. మిడ్నపూర్ సిటీలో బుధవారం ఈ సంఘటన జరిగింది. 


మిడ్నపూర్ సిటీలో వేర్వేరు చోట్ల రామ పూజలు, యజ్ఞాలు నిర్వహించేందుకు బీజేపీ కార్యకర్తలు సన్నాహాలు చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు గుచెయిత్, ఇతర బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. 


బీజేపీ జిల్లా శాఖ అధ్యక్షుడు సమిత్ దాస్ మాట్లాడుతూ, పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఈ అరెస్టులకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసులు ఇదే విధానాన్ని కొనసాగిస్తే, తాము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. 


అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, బాబా రామ్‌దేవ్ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-08-05T20:32:49+05:30 IST