SSC recruitment Scam: మీడియా కథనాలపై మమత మండిపాటు

ABN , First Publish Date - 2022-07-27T23:15:57+05:30 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కుంభకోణానికి (teacher recruitment scam) సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి...

SSC recruitment Scam: మీడియా కథనాలపై మమత మండిపాటు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కుంభకోణానికి (teacher recruitment scam) సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (mamata banerjee) అసహనం వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్ ప్రజలను దోషులుగా చూపే ధోరణి సరికాదని ఆమె మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దోషులుగా తేలితే కోర్టు శిక్షిస్తుందని, మధ్యలో మీడియా రచ్చ ఏంటని ఆమె ప్రశ్నించారు. సొంత కథనాలు రాయవద్దని ఆమె మీడియాకు సూచించారు. రాష్ట్ర మంత్రి పార్థా ఛటర్జీ (partha chatterjee) సహాయకురాలు, నటి, మోడల్ అర్పితా ముఖర్జీ (arpitha mukherjee) ఇంట్లో దొరికిన 21 కోట్ల రూపాయలతో పాటు తన ఫొటో చూపించడాన్ని మమత తప్పుబట్టారు. పార్థా ఛటర్జీ దోషిగా తేలితే జీవితఖైదు విధించినా తనకు అభ్యంతరం లేదని తానెప్పుడూ అవినీతిని సమర్థించబోనని మమత చెప్పారు. ప్రభుత్వానికి కానీ, పార్టీకి కానీ అర్పితా ముఖర్జీతో ఎలాంటి సంబంధాలు లేవన్నారు. 


మూడు, నాలుగు ఏజెన్సీల ద్వారా బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రాలను కబళించాలని చూస్తోందని మమత ఆరోపించారు. ఇప్పటికే మహారాష్ట్రలో పాగా వేశారని, ప్రస్తుతం జార్ఖండ్‌లో కూడా అలాంటి ప్రయత్నాలే చేస్తున్నారని ఆమె అన్నారు. అయితే పశ్చిమబెంగాల్ జోలికి రావొద్దని ఆమె హెచ్చరించారు. బెంగాల్ జోలికి రావాలంటే ముందుగా రాయల్ బెంగాల్ టైగర్‌తో ఢీ కొనాల్సి ఉంటుందంటూ మమత తనను తాను రాయల్ బెంగాల్ పులిగా అభివర్ణించుకున్నారు.   

Updated Date - 2022-07-27T23:15:57+05:30 IST