కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో నటి, మోడల్ మంజూజా నియోగీ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. పటూలి ప్రాంతంలోని ఆమె నివాసం నుంచి మంజూష మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. ఆమె బలవన్మరణానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.
తన స్నేహితురాలి మరణాన్ని తట్టుకోలేక ఆమె డిప్రెషన్‌కు గురయ్యారని సన్నిహితులు చెబుతున్నారు. మంజూష స్నేహితురాలు బిడిష మే 25న కోల్‌కతాలోని తన అపార్ట్మెంట్లో ఉరివేసుకుని చనిపోయారు. బిడిషలాగే తాను కూడా చనిపోతానని ఒకరోజు ముందే తనతో చెప్పిందని మంజూష తల్లి కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఎంత నచ్చచెప్పినా డిప్రెషన్‌నుంచి బయటపడకుండా ప్రాణాలు తీసుకుందని వాపోతున్నారు.
కోల్‌కతాలో 15 రోజుల వ్యవధిలోనే ఈ తరహా ఘటన జరగడం ఇది మూడోసారి. ప్రముఖ టీవీ నటి పల్లవి డే కోల్‌కతాలోని అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు.