ఖరీఫ్‌కు విత్తనాలు సిద్ధం

ABN , First Publish Date - 2022-05-20T05:57:14+05:30 IST

ఖరీఫ్‌ సీజన్‌కు రైతులకు అవసర మైన వరి విత్తనాలు ఏపీ సీడ్స్‌లో అందుబాటులోకి వచ్చా యి.

ఖరీఫ్‌కు విత్తనాలు సిద్ధం
విత్తనాల బస్తాలు


తణుకు, మే 19 : ఖరీఫ్‌ సీజన్‌కు రైతులకు అవసర మైన వరి విత్తనాలు ఏపీ సీడ్స్‌లో అందుబాటులోకి వచ్చా యి.  జిల్లా వ్యాప్తంగా 2లక్షల 48 వేల 628 ఎకరాలు వరి సాగు చేస్తున్నారు. దానికి సంబంధించి 49 వేల 725 క్వింటాళ్లు వరి విత్తనాలు అవసరమవుతాయి. ఇందులో 90 శాతం చుట్టుపక్కల రైతుల నుంచి సేకరించిన విత్త నాలు ఉండగా కేవలం 5 శాతం మాత్రమే ఏపీ సీడ్స్‌ నుంచి  రైతులు తీసుకుంటారు. ప్రధానంగా 1061, 1121, 1064, స్వర్ణ రకాలు సాగు చేస్తుంటారు. వాటినే రైతులు ఎక్కువగా నారుమడులు వేస్తుంటారు. ఏపీ సీడ్స్‌ నుంచి తయారుచేసిన వరి విత్తనాలు  31 వేలు క్వింటాళ్ల వరకు ఇతర జిల్లాలకు పంపిస్తుంటారు. శ్రీకాకుళం, విజయ నగ రం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు రవాణా చే ్తారు. వీటిలో 1024, స్వర్ణ, 11 21, రకాలు ఉన్నాయి. స్వర్ణ 8 వేలు క్వింటాళ్లు, 1024 రకం 8వేల క్వింటాళ్లు, 1121 రకం 15 వేల క్వింటాళ్ల వరకు పంపి స్తుంటా రు. రబీలో వచ్చే విత్తనాల ధాన్యాన్ని ప్రాసె సింగ్‌ చేయడం ద్వారా మరిన్ని విత్తనాలు సిద్ధం చేస్తున్నట్టు ఏపీ సీడ్స్‌ జిల్లా మేనేజరు శారద తెలిపారు. 

Updated Date - 2022-05-20T05:57:14+05:30 IST