భయపెడుతున్న ఊబకాయం

ABN , First Publish Date - 2022-09-11T06:15:50+05:30 IST

ఆహారపు అలవాట్లతో ఊబకాయాన్ని కొనితెచ్చుకుని ప్రాణాంతక వ్యాఽధుల బారిన పడుతున్నారు.

భయపెడుతున్న ఊబకాయం

రాష్ట్రంలో మహిళలే అధికం
పిల్లల్లోనూ అదే సమస్య
జాతీయ కుటుంబ సర్వేలో వెల్లడి
1975తో పోలిస్తే మూడురెట్లు అధికం
2030 నాటికి 50 శాతం పెరిగే ప్రమాదం
మారిన జీవన శైలి ప్రధాన కారణం

భారతీయులు తెగ తినేస్తున్నారని అమెరికా మాజీ అధ్యక్షుడు ఘాటుగా వ్యాఖ్యానించడం గుర్తు ఉండే ఉంటుంది. దానిపై మనవాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అది నిజమేనేమో అనిపిస్తోంది. ఉన్నవాడికి తింటే అరగదు. లేనివాడికి తిండే  దొరకదు అన్న చందాన ఆహారపు అలవాట్లతో ఊబకాయాన్ని కొనితెచ్చుకుని ప్రాణాంతక వ్యాఽధుల బారిన పడుతున్నారు. పెద్దలతో పాటు పిల్లల్లోనూ ఈ సమస్య అధికంగా కన్పిస్తోంది. వంశపారం పర్యంగా వచ్చే ఊబకాయం శాతం తక్కువగా ఉండగా, పౌరుల జీవన శైలివల్లనే అధికశాతం ఊబకాయం బారిన పడుతున్నారని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి.

 పాలకొల్లు, సెప్టెంబరు 10 : ఆదివారం వచ్చిందంటే బామ్మకి మటన్‌ కైమా.. చంటి దానికి రొయ్యలు, ఇల్లాలికి చేప, పిల్లగాడికి చికెన్‌, ఇంటాయనకు పీత ఇది మెనూ. ఆహారపు అలవాట్లు గతం కన్నా ఇప్పుడు విపరీత ధోరణులు పట్టడం, జీవన ప్రమాణాలు మెరుగు పడి, అవసరాన్ని మించి తినేయడంతో ఊబకాయం దానంతట అదే వచ్చేస్తోం ది. ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ కుటుంబ సర్వేలో మన రాష్ట్రంలో పురుషుల్లో కంటే మహిళల్లోనే అధిక శాతం ఊబకాయులు ఉన్నట్టు వెల్లడయ్యింది.
 జాతీయ కుటుంబ సర్వే ప్రకారం 1975తో పోలిస్తే ఇప్పుడు ఊబకాయుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. 2030 నాటికి యుక్తవయస్సు యువతీ, యువకులలో 50 శాతం పైబడి ఊబకాయులు తయారయ్యే పరిస్థితి ఉందని తేలడం ఆందోళన కలిగించే అంశం.
 ప్రపంచ వ్యాప్తంగా 800 మిలియన్ల పౌరులు ఊబ కాయంతో కాలం వెల్లదీస్తున్నారు. మారుతున్న ఆహారపు అలవాట్లు, తగినంత వ్యాయామం లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.
 ఒకప్పుడు 40 ఏళ్ల పైబడిన వారిలో ఊబకాయులు కనిపిస్తూండే వారు. నేడు ఇది బాల్యం నుంచే వెంటా డుతున్నది. అధిక పొట్ట – రోగాలపుట్ట అన్న నానుడిని ఇప్పుడు ఊబకాయం నిజం చేస్తోంది.
 వయస్సు, పొడవు ప్రామాణికంగా మనుష్యల బరువు ఉండాలి.. అయితే ఇప్పుడు ఊబకాయులు ఉండాల్సిన బరువు కన్నా రెట్టింపు బరువు ఉంటున్నారు.
 కేజీ నుంచి పీజీ వరకూ ర్యాంకుల వేటలో చదువుకే ప్రాధాన్యం ఇస్తుండడం, నడక, స్లైక్లింగ్‌, వ్యాయామం జోలికే పోక పోవ డంతో పిల్లలు ఎదిగి యుక్త వయస్సుకు వచ్చే సరికి అధిక బరువు పెరుగుతు న్నారు. దీంతో తెలియకుండానే యువతీ, యువకులు ఏటికేడాది బరువు పెరిగిపోతున్నారు.
 యుక్త వయస్సు యువతీ యువకులలో ఊబకాయం వివాహానంతరం సమస్యలను తెచ్చి పెడుతున్నది. ఊబకాయం ఉన్న పలు జంటల్లో పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా, పిల్లలు కలగక వేదన చెందుతున్నారు.


మహిళల్లోనే అత్యధికం
ప్రధానంగా ఊబకాయం మహిళలకు శాపంగా మారింది. ముఖ్యంగా ఇంటిపట్టునే ఉండే గృహిణుల్లో ఇది ఎక్కువ శాతం కనిపిస్తోంది. ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లో ఉన్న మహిళలల్లో ఈ శాతం కొంచెం తక్కువగా కనిపిస్తోంది. వంట, ఇంటి పని అనంతరం టీవీలు, లేదా సెల్‌ఫోన్లకు అతుక్కుపోయి ఉండడం, యాంత్రిక జీవనంలో తెలియని ఆందోళనలతో ఆహారం అధికంగా తీసుకోవడం, మితి మీరిన మాంసాహార వినియోగం ఊబ కాయానికి దారి తీస్తోంది. దీంతో పెళ్లయిన మహిళల్లో సంతాన లేమి ఏర్పడుతున్నది.
 
వ్యాధుల బారిన..
ఊబకాయులలో అధిక శాతం వ్యక్తులు మధుమేహానికి (షుగర్‌) వ్యాధికి గురి కావడ మే కాకుండా థైరాయిడ్‌ వ్యాధులు వస్తున్నా యి. ఊబకాయంతో జీవిత కాలం కుంచించుకు పోతున్నది. దీర్ఘకాలిక వ్యాధు లు వాటంతట అవే వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
 ఊబకాయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తీవ్రంగా హెచ్చరిస్తోంది. ఊబకాయం కారణంగా 13 రకాల కేన్సర్లు, టైపు 2 మధు మేహం, గుండె సంబంధిత వ్యాధులు, పురుషులలో సంతాన సమస్యలు ఎదుర వుతాయని డబ్ల్యూహెచ్‌వో ఇటీవల హెచ్చరించింది.

చిరుతిళ్లతోనే ప్రమాదం..
 ఇప్పుడు మూడింట రెండొంతుల కుటుంబాలు నిత్యం ఏదో ఒక పూట బయట ఆహారాల పైనే ఆధార పడు తు న్నాయి. ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, బజ్జీ బళ్ళు, పానీపూరిలు, చిరుతిళ్ళు ఊబ కాయాన్ని పెంచేస్తున్నాయి.
 రోడ్డు మార్జిన్లలో పట్టణాలు, గ్రామాలు తేడా లేకుండా ఇప్పుడు బజ్జీ బళ్ళు ఆహార ప్రియులను రా రమ్మని అహ్వానిస్తున్నాయి. కాక నూనెలో వేయించిన బజ్జీలు, ఇతర వంటకాలు ఆబగా తినేస్తూ పొట్టలు పెంచేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కేవలం బజ్జీబళ్లకే రోజుకు 5 టన్నుల శనగ పిండి, మూడుటన్నుల పచ్చిమిర్చి వినియోగిస్తున్నా రంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

సంతానలేమి సమస్య..
ఊబకాయులలో ఇటీవల పెళ్లైన జంటలలో 8 నుంచి 10 శాతం సంతాన లేమితో బాధ పడుతు న్నారు. రెండేళ్లపాటు దైనికజీవితం గడిపినా గర్భం ధరించకుంటే ప్రమరీ, ఇన్‌ఫెర్టిలిటిగా సూచించాల్సి ఉంటుంది. ఊబకాయులలో   పిట్యూటరీ, థెరాయిడ్‌, టెస్టో స్టెరాన్‌ హార్మోన్లలో వచ్చే హెచ్చుతగ్గుల వల్ల శుక్రకణాల ఉత్పత్తిపై ప్రభావం పడి సంతాన లేమికి దారి తీస్తున్నది. ఊబకాయం ఉన్న స్త్రీలలో ఎక్కువగా గర్భస్రావం అయ్యే అవకాశం ఉంటుంది.  మరోసారి గర్భధారణకు అవకాశం తగ్గుతుంది.
– డాక్టర్‌ ఎం.సిరి చందన, (జనరల్‌ మెడిసిన్‌)

పిల్లల్లో ఊబకాయం... ప్రమాదకరం
పిల్లలకు తల్లి పాల తరువాత సమతుల్య ఆహారం అలవాటు చేయాలి, చాక్లెట్లు, ఐస్‌ క్రీములు, బిస్కెట్లకు దూరంగా ఉంచాలి. చదువుతో పాటు వ్యాయామానికి సమయం కేటాయించాలి. పాఠశాల దగ్గరలోఉంటే నడిపించి తీసుకువెళ్లడం లేదా సైక్లింగ్‌ చేయించడం చేయాలి. ఇప్పుడు పిల్లలను అతి గారాబంగా పెంచడం, వారు కోరిన ఆహారాన్ని కొని ఇవ్వడంతో పిల్లల్లో అధిక బరువు పెరుగుతోంది. ముఖ్యంగా ఇంటి పట్టున ఉండే మహిళలు ఇంటి పని పూర్తి అయిన తర్వాత టీవీలు, సెల్‌ఫోన్లను చూస్తూ తెలియకుండానే అధిక ఆహారం తినడంతో పాటు, శీతల పానీయాలు తీసుకుంటై ఊబకాయాన్ని తెచ్చుకుంటున్నారు. ఆహారపు అలవాట్లు మార్పు చేసుకోవడం వ్యాయామం చేయడం ద్వారా ఊబకాయాన్ని అదుపులో పెట్టవచ్చు.  
– డాక్టర్‌ కేఎస్‌పీఎన్‌ వర్మ, చిన్నపిల్లల వైద్యులు

Updated Date - 2022-09-11T06:15:50+05:30 IST