Abn logo
Apr 13 2021 @ 00:57AM

ఈతకు వెళ్లి బాలుడి మృతి

కళ్యాణదుర్గం, ఏప్రిల్‌  12: మండలంలోని గో ళ్ల గ్రామానికి చెందిన బాలుడు హనుమేష్‌ (12) సోమవారం చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందా డు. స్థానికులు తెలిపిన వివరాలివి. హనుమేష్‌తో కలిసి మరో నలుగురు పిల్లలు ఈత కోసం గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఈతకొడుతు న్న సమయంలో హనుమేష్‌ ఎంతసేపటికి కనిపించలేదు. గమనించిన మిగతా పిల్లలు ఇంటికి వెళ్లి  తండ్రి ఓబుళే్‌షకు సమాచారం అందించారు. వెంటనే స్థానికులతో కలసి చెరువులో గా లించారు. చెరువులో చాకలి రేవు కోసం తీసిన గోతిలో హనుమేష్‌ ఇరుక్కుపోయాడు. బా లుడిని గుర్తించి బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడ. ఒక్కగానొక్క కుమారుడు నీట మునిగి మృతి చెండంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 

Advertisement
Advertisement
Advertisement