చికెన్ తెస్తానని వెళ్లి.. సాయంత్రానికి కోటీశ్వరుడయ్యాడు.. దెబ్బకు ఈ పెయింటర్ రాతే మారిపోయింది..

ABN , First Publish Date - 2022-01-17T22:00:32+05:30 IST

కేరళలో ఓ వ్యక్తికి కూడా ఇలాగే సాయంత్రానికల్లా రాత మారిపోయింది. పెయింటర్‌గా పని చేసే వ్యక్తి.. ఒక్కసారిగా రూ.12కోట్లకు అధిపతి అయ్యాడు. చికెన్ తెస్తానని బజారుకు వెళ్లాడు. సాయంత్రానికి ఇంటికి వచ్చే లోపు..

చికెన్ తెస్తానని వెళ్లి.. సాయంత్రానికి కోటీశ్వరుడయ్యాడు.. దెబ్బకు ఈ పెయింటర్ రాతే మారిపోయింది..

ఎవరి రాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. ఎంత కష్టపడుతున్నా అంతంత మాత్రం ఆదాయంతో కుటుంబాలను నెట్టుకొచ్చేవారు కొందరుంటే.. ఇంకొందరు ఎలాంటి కష్టం లేకుండా, రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతుంటారు. కేరళలో ఓ వ్యక్తికి కూడా ఇలాగే సాయంత్రానికల్లా రాత మారిపోయింది. పెయింటర్‌గా పని చేసే వ్యక్తి.. ఒక్కసారిగా రూ.12కోట్లకు అధిపతి అయ్యాడు. చికెన్ తెస్తానని బజారుకు వెళ్లాడు. సాయంత్రానికి ఇంటికి వచ్చే లోపు కోటీశ్వరడయ్యాడు. దీంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందనానికి అవధులు లేకుండా పోయాయి. వివరాల్లోకి వెళితే..


కేరళలోని కొట్టాయంకు సమీపంలోని కుడయంపడికి చెందిన సదానందన్ పెయింటర్‌గా పని చేస్తుంటాడు. ఈయనకు భార్య రాజమ్మ, సనీష్, సంజయ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు పెయింటర్‌గా పని చేస్తూ, వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఆదివారం కావడంతో కుటుంబమంతా సరదాగా గడపాలనుకున్నారు. పొద్దున్నే చికెన్ తీసుకురావడానికి బయటికి వెళ్లాడు. అయితే అక్కడికి వెళ్లాక చూసుకుంటే జేబులో రూ.500నోటు ఉంది. దీంతో చిల్లర కోసం సమీపంలోని ఓ దుకాణం వద్ద రూ.12కోట్లకు సంబంధించిన లాటరీ టికెట్ కొన్నాడు.

డబ్బులు నష్టపోయానని కస్టమర్ కేర్ నంబర్‌కు ఫోన్ చేసిన మహిళ.. చివరగా అకౌంట్ బ్యాలెన్స్ పరిశీలిస్తే..


లాటరీ టికెట్ కొనగా మిగిలిన డబ్బులతో చికెన్ కొని ఇంటికి తెచ్చాడు. అయితే సాయంత్రానికి ఆ కుటుంబం మొత్తం ఉబ్బితబ్బిబ్బయ్యే వార్త విన్నారు. లాటరీ నిర్వాహకులు సాయంత్రం టికెట్లను డ్రా తీయగా.. సదానందం కొన్న ‘XG 218582’ టికెట్‌కు లాటరీ తగిలింది. దీంతో పెయింటర్ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వార్త తెలిసిన వెంటనే చుట్టుపక్కల వారు, మీడియా ప్రతినిధులు వారిని చుట్టుముట్టారు. వచ్చిన డబ్బులతో మంచి ఇల్లు కట్టుకుని, మిగతా డబ్బులను కొడుకుల సలహా మేరకు ఖర్చు పెడతానని సదానందం చెబుతున్నాడు. చిల్లర కోసం లాటరీ టికెట్ కొన్న సదానందం, ఇలా ఒక్కసారిగా కోటీశ్వరుడు అవ్వడం.. చుట్టు పక్కల ప్రాంతాల్లో సంచలనమైంది.

రాత్రికి రాత్రే ట్యాంకర్లలోంచి 3000 లీటర్ల డీజిల్ మాయం.. సీసీ కెమెరాలను చెక్ చేస్తే..



Updated Date - 2022-01-17T22:00:32+05:30 IST