Advertisement
Advertisement
Abn logo
Advertisement

వేముల‘పాడు రోడ్డు’

రోడ్డుపై గుంతలతో వాహనదారుల అవస్థలు

యాడికి, అక్టోబరు17: మండలకేంద్రం నుంచి వేము లపాడుకు వెళ్లే రోడ్డు గుంతలమయం కావడంతో అటు వైపు వెళ్లాలంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ రోడ్డులో ప్రతిరోజూ వందల సంఖ్యలో వాహనదారులు వెళుతుంటారు. రోడ్డుపై గుంతలు ఎలా తప్పించాలో తెలియక తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇదేరోడ్డులో ప్రయాణిస్తున్నా ఈ గుంతలు ఏవీ వారికి కనిపించకపోవడం గమనార్హం. రోడ్డు దుస్థితిని పట్టించుకొనేవారే లేకపోవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నా రు. గుంతలమయమైన రోడ్డుపై తమ ప్రాణాలు పోకముం దే అధికారుల నుంచి స్పందన రాకపోతుందా... రోడ్డుకు మరమ్మతులు చేపట్టకపోతారా అని వాహనదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

ఈ గుంతలు దాటాలంటే ఎన్ని అవస్థలో


Advertisement
Advertisement