శభాష్‌ పోలీస్‌

ABN , First Publish Date - 2021-07-28T07:02:00+05:30 IST

కుటుంబ సమస్యలతో తన ఇద్దరి కుమారులతో కలిసి ఓ మహిళ చేసిన ఆత్మహత్యాప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

శభాష్‌ పోలీస్‌
తల్లీబిడ్డలతో ఈపూరుపాలెం ఎస్సై సుబ్బారావు, పోలీసు సిబ్బంది

ఇద్దరి పిల్లలతో సహా మహిళ ఆత్మహత్యాయత్నం

సెల్‌ సిగ్నల్‌ ఆధారంగా మహిళ గుర్తింపు

కాపాడి ఒంగోలు పోలీసులకు అప్పగింత

చీరాల టౌన్‌, జూలై 27 : కుటుంబ సమస్యలతో తన ఇద్దరి కుమారులతో కలిసి ఓ మహిళ చేసిన ఆత్మహత్యాప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వేగంగా స్పందించి ముగ్గురి ప్రాణాలను కాపాడారు. అందరితో శభాష్‌ అనిపించుకున్నారు. ఒంగోలులోని వెంకటేశ్వర కాలనీకు చెందిన బూదాడ అనురూప, అనుదీప్‌ కుమార్‌ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల అనురూపకు భర్త, కుటుంబసభ్యుల నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. దీంతో విసిగిపోయిన ఆమె తన ఇద్దరు కుమారులతో కలిసి చనిపోవాలని నిర్ణయించుకుంది. మంగళవారం ఉదయం  ఇంటి నుంచి బయటకు  వచ్చింది. వెంటనే భర్త కుటుంబసభ్యులతో కలిసి ఒంగోలు తాలూకా పోలీసులను ఆశ్రయించారు. వారు తక్షణమే రంగంలోకి దిగారు. ఆమె సెల్‌నంబర్‌ సిగ్నల్‌ వాడరేవు సముద్రతీరం వద్ద ఉన్నట్లు  గుర్తించారు. వెంటనే ఈపూరుపాలెం ఎస్సై సూరేపల్లి సుబ్బారావుకు సమాచారం ఇచ్చారు. ఆయన వేగంగా స్పందించి హోంగార్డులు జిలానీ, నరసింహ సహాయంతో వాడరేవు సముద్రతీరంలో గాలించారు. వాడరేవు దగ్గరలో సముద్రంలోకి దిగి ఆత్మహత్యా ప్రయత్నంలో ఉన్న ఆమెను గుర్తిం చి అడ్డుకున్నారు.  స్టేషన్‌కు తీసుకు వచ్చి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అనంతరం ఒంగోలు పోలీసులకు అప్పగించారు. వేగంగా స్పందించి ముగ్గురు ప్రాణాలను కాపాడిన పోలీసులు స్థానికులు శభాష్‌ అంటూ ప్రశంసించారు. 




Updated Date - 2021-07-28T07:02:00+05:30 IST