పల్లెల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: మను చౌదరి

ABN , First Publish Date - 2020-02-20T06:25:56+05:30 IST

దేశానికి పల్లెలే పట్టు గొమ్మలని, గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ మను చౌదరి పేర్కొన్నారు. మండలంలోని పెద్దాపూర్‌

పల్లెల అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: మను చౌదరి

వెల్దండ, ఫిబ్రవరి 19 : దేశానికి పల్లెలే పట్టు గొమ్మలని, గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ మను చౌదరి పేర్కొన్నారు. మండలంలోని పెద్దాపూర్‌, చెర్కూర్‌, వెల్దండ, కొట్ర గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని నర్సరీలు, శ్మశాన వాటికలు, డంపింగ్‌ యార్డులను పరిశీలించారు. వెల్దండలోని నర్సరీ పనులను త్వరితగతిన చేపట్టాలని, వేసవి రాకముందే మొక్కల పెంపకం చేపడితే ఫలితం ఉంటుందని సిబ్బందికి సూచించారు. శ్మశాన వాటికల పనులను పూర్తి చేయాలని, డంపింగ్‌ యార్డులతో గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయని, వాటిని వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం హరితహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని, ఇందుకు అనుగుణంగా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ముందుకుసాగాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు గోరటి శ్రీను, రేవతి, భూపతిరెడ్డి, వెంకటేశ్వరరావు, ఎంపీటీసీలు చక్రవర్తిగౌడ్‌, రాములు, ఉప సర్పంచ్‌ నిరంజన్‌, ఏపీవో లక్ష్మారెడ్డి, టీఏ రాజ్‌కుమార్‌, ఎంపీవో సునిత, బీజేపీ మండలశాఖ అధ్యక్షుడు విజేందర్‌రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T06:25:56+05:30 IST