దానివల్లే నాసాలో చోటు దక్కించుకోగలిగాను: స్వాతి మోహన్‌

ABN , First Publish Date - 2021-07-30T13:52:17+05:30 IST

భౌతిక శాస్త్రంపై లోతైన అధ్యయనం చేసి పట్టు సాధించడం వల్లే అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలో చోటు దక్కించుకోగలిగానని..

దానివల్లే నాసాలో చోటు దక్కించుకోగలిగాను: స్వాతి మోహన్‌

పురుషాధిక్య సమాజంలో ఆటుపోట్లు ఎదుర్కొన్నా

భారత సంతతి శాస్త్రవేత్త స్వాతి మోహన్‌

చెన్నై, జూలై 29 (ఆంధ్రజ్యోతి): భౌతిక శాస్త్రంపై లోతైన అధ్యయనం చేసి పట్టు సాధించడం వల్లే అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలో చోటు దక్కించుకోగలిగానని.. ఇటీవల ‘మార్స్‌ 2020 పెర్‌సెవరెన్స్‌ మిషన్‌’లో కీలక పాత్ర పోషించిన భారత సంతతికి చెందిన స్వాతి మోహన్‌ తెలిపారు. పురుషాధిక్య సమాజంలో తన కెరీర్‌లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు. భౌతికశాస్త్రంపై సులువుగా పట్టు సాధించినప్పటికీ జీవశాస్త్రం అంత సులువుగా నేర్వలేకపోయానని అన్నారు.


నాసాలో జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీలో పొందిన శిక్షణ తన అంతరిక్ష అన్వేషణలకు దోహదం చేసిందన్నారు. చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయంలో గురువారం వర్చువల్‌గా నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని యూఎస్‌ కాన్సుల్‌ జనలర్‌ జుడిత్‌ రావిన్‌ ప్రారంభించారు.  స్కూలు ఇంటర్న్‌షిప్‌ ద్వారా నాసాలో చోటు లభించిందని చెప్పారు. 

Updated Date - 2021-07-30T13:52:17+05:30 IST