నత్తనడకన బావి నిర్మాణ పనులు

ABN , First Publish Date - 2021-05-17T05:52:07+05:30 IST

మండలంలోని లక్ష్మింపూర్‌ గ్రామ సమీపంలో కోలాం గిరి జనులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఐటీడీఏ పీవో గత నెలలో బావి నిర్మాణం కోసం భూమిపూజ చేసి పనులను ప్రారంభించినప్పటికీ బావి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

నత్తనడకన బావి నిర్మాణ పనులు
లక్ష్మింపూర్‌లో నిర్మిస్తున్న తాగునీటి బావి

తలమడుగు, మే 16: మండలంలోని లక్ష్మింపూర్‌ గ్రామ సమీపంలో కోలాం గిరి జనులకు తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఐటీడీఏ పీవో గత నెలలో బావి నిర్మాణం కోసం భూమిపూజ చేసి పనులను ప్రారంభించినప్పటికీ బావి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులను పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోక పోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 20 రోజులుగా బావి నిర్మాణ పనులను సదరు కాంట్రాక్టర్‌ నిలిపివేయడంతో లక్ష్మింపూర్‌ గిరిజనులకు తాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. లక్ష్మింపూర్‌ గ్రామస్థులు తాగునీటి సమస్య పరిష్కరించాలని పలుమార్లు ఐటీడీఏ అధికారులకు విన్నవించగా పీవో స్పందించి నిధులు మం జూరు చేసినప్పటికీ బావి నిర్మాణం పనులు ముందుకు సాగడం లేదు. వేసవి కాలం ముగుస్తునప్పటికీ గిరిజనులకు తాగునీరు లభించే అదృష్టం లేదని గిరిజ నులు వాపోయారు. బావి నిర్మాణం కోసం ఐటీడీఏ ద్వారా రూ.5లక్షల నిధులను పీవో మంజూరు చేయడం జరిగింది. ఇకనైనా అధికారులు స్పందించి నత్తనడకన సాగుతున్న లక్ష్మింపూర్‌ బావి నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి గిరిజనులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలని గిరిజనులు కోరుతున్నారు. కాగా మిషన్‌ భగీరథ నీరు రాని రోజు తాగునీటి కోసం ఇబ్బందులు ఎదురవుతున్నా యని గిరిజనులు పేర్కొన్నారు.

Updated Date - 2021-05-17T05:52:07+05:30 IST