అరటి గెలను చూపుతున్న రైతు
- మహానందిలో 300 కాయల గెల
మహానంది, జనవరి 20: మహానంది మండలం అయ్యన్ననగర్ సమీపంలో రైతు మిద్దె చిన్న సుబ్బరాయిడు సాగు చేసిన అరటి తోటలో ఒకే గెలకు 300 బూడిదరకం అరటి కాయలు కాశాయి. ఏపుగా పెరిగిన అరటిని రైతు గురువారం మహానందిలో ప్రజల కోసం ప్రదర్శించా డు. సాధారణంగా అరటి గెలకు నూరు నుంచి రెండు వందల వరకు దిగుబడి వస్తుంది. అలాంటింది బూడిదరకం అరటి చెట్టుకు ఏకంగా 300 అరటికాయలు రావడం విశేషమని రైతు ఆనందం వ్యక్తం చేశారు.