సంక్షేమ పథకాల్లో పేదలకు లబ్ధి చేకూరాలి

ABN , First Publish Date - 2022-07-03T04:55:55+05:30 IST

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో పేద ప్రజలకు లబ్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం సంధ్యారాణి అన్నారు.

సంక్షేమ పథకాల్లో పేదలకు లబ్ధి చేకూరాలి
సమావేశంలో మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి సంధ్యారాణి

- సీనియర్‌ సివిల్‌ జడ్జి సంధ్యారాణి

మహబూబ్‌నగర్‌ లీగల్‌కంట్రిబ్యూటర్‌, జూలై 2 : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో పేద ప్రజలకు లబ్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి  ఎం సంధ్యారాణి అన్నారు. రాష్ట్ర న్యాయఅధికార సేవాసంస్థ ఆదేశాల మేరకు నాల్సా చట్టం 2015పై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె  మాట్లాడుతూ  అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరికీ లబ్ధి చేకూరేల ఈ శ్రమ్‌లో నమోదు చేయించాలని కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి పర్యవేక్షణలో నడుస్తున్న స్టేట్‌హోంలో మహిళలకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ అధికారి యాదయ్య, సీడీపీవో శాంతిరేఖ, పీఎల్‌వీ యాదయ్య, డీసీఎల్‌ యాదయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T04:55:55+05:30 IST