Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి’

కౌటాల, అక్టోబరు 20: సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ విశ్వనాథ్‌ అన్నారు. బుధవారం కౌటాల మండల కేంద్రంలోని సిద్దార్థ హెచ్‌పీ గ్యాస్‌ ఏజెన్సీలో ఉజ్వల పథకం కింద 81మంది లబ్ధిదారులకు గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీలర్‌ జానకీరావు, నాయకులు రవీందర్‌గౌడ్‌, తదితరులు ఉన్నారు. 

చింతలమానేపల్లి: మండలకేంద్రంలో బుధవారం ఉజ్వలయోజన పథకం కింద 86మంది లబ్ధిదారులకు గ్యాస్‌కనెక్షన్లు ఎంపీపీ నానయ్య పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు నానయ్య, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, నారా యణ, కోటేష్‌, ప్రసాద్‌, రషీద్‌, హరీష్‌, పాపయ్య, రాజన్న పాల్గొన్నారు.

Advertisement
Advertisement