సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-09-25T07:00:55+05:30 IST

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క అన్నారు.స్థానిక తహసీల్దార్‌ కార్యాల యంలో

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ఎమ్మెల్యే సీతక్క


తాడ్వాయి, సెప్టెంబరు 24: సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క అన్నారు.స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో  ఆమె గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబా రక్‌ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.  పేదల కోసం ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాల ను అందిపుచ్చుకుని ఆర్థికపరిపుష్టి పొందాలన్నారు.  అనంతరం కాటాపూర్‌లోని మహ్మద్‌ ఖాజా కుటుం బానికి ఎమ్మెల్యే సీతక్క సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి మంజూ రైన రూ.9వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ గొంది వాణిశ్రీ, జడ్పీ వైస్‌చైర్‌పర్సన్‌ బడే నాగజ్యోతి, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, మండల అధ్యక్షుడు జాలపు అనంతరెడ్డి, కాంగ్రెస్‌పార్టీ జిల్లా అఽధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, నాయకులు అప్సర్‌పాషా, నామ కరంచంద్‌గాంధీ, బొల్లు దేవేందర్‌ పాల్గొన్నారు. 


వైస్‌ ఎంపీపీకి పరామర్శ

 ఏటూరునాగారం రూరల్‌ : మండలంలోని చిన్న బోయినపల్లిలో వైస్‌ ఎంపీపీ తుమ్మా సంజీవరెడ్డి తం డ్రి సాయిరెడ్డి ఇటీవల మరణించిగా ఆయన కుటుంబాన్ని ములుగు ఎమ్మెల్యే సీతక్క గురువారం పరామర్శించారు. ఆమె వెంట కాంగ్రెస్‌ నాయకులు ఇర్సవడ్ల వెంకన్న, బాసాని విద్యాసాగర్‌ తదితరులు ఉన్నారు. 


కరోనా బాధితులకు సరుకుల పంపిణీ 

గోవిందరావుపేట : మండలంలోని ముత్తాపూర్‌ గ్రామంలోని 25 కరోనా బాధిత కుటుంబాలకు గురువారం ఎమ్మెల్యే  సీతక్క బియ్యం, కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండలపార్టీ అధ్యక్షుడు పన్నాల ఎల్లారెడ్డి, నాయకులు జెట్టి సోమ య్య, ధర్మ అంజిరెడ్డి, కొంపెల్లి శ్రీనివాసరెడ్డి, దేపాక కృష్ణ, మండల పురుషోత్తం, కడియాల నరేందర్‌, కుర్సం కన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-25T07:00:55+05:30 IST