Abn logo
Oct 17 2021 @ 00:32AM

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

వలేటివారిపాలెంలో మాట్లాడుతున్న మంత్రి బాలినేని

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి

కొత్తపట్నం(ఒంగోలునగరం), అక్టోబరు 16: పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నట్టు రాష్ట్ర అటవీ, విద్యు త్‌, పర్యాటక శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం మండల కార్యాలయం వద్ద జరిగిన ఆసరా చెక్కుల పంపిణీ కార్య క్రమంలో ఆయన మాట్లాడారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్ర మాలను అమలు చేయటంలో రాజీ పడబోమన్నారు. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ రోడ్ల నిర్మాణం జరగకుండా పరోక్షంగా అడ్డుపడుతున్నారన్నారు. సభలో ఆ సరా పథకం కింద రూ.9.46 కోట్లు, స్ర్తీనిధి కింద 2.70 కో ట్లు పొదుపు సంఘాల మహిళలకు పంపిణీ చేశారు. ముందుగా మంత్రి బాలిలినేని కొత్తపట్నంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవ నాన్ని ప్రారంభించారు.  కార్యక్రమంలో జేసీ కృష్టవేణి, జడ్పీటీసీ లక్ష్మీశారద, ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందాలి

ఒంగోలు (రూరల్‌), అక్టోబరు 16: ప్రతి మహిళా ఆర్థికంగా ఎదిగి  బాగుండాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం ఒం గోలు మండలం వలేటివారిపాలెం గ్రామంలో ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాడు - నేడు పథకంతో  పాఠ శాలల రూపురేఖలు మారాయన్నారు. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ఉంటున్నాయన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకా యమ్మ మాట్లాడుతూ గ్రామాలలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం మహిళలకు రూ.ఐదు కోట్ల 15లక్షలు విలువచేసే ఆసరా రుణమాఫీ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ప్రత్యేకాధికారి కె.కృష్ణవేణి, ఎంపీపీ పల్లపోలు మల్లికార్జునరెడ్డి, జడ్పీటీసీ చుంటూరి కోమలేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

రంగారాయుడుచెరువు అభివృద్ధికి కృషి

ఒంగోలు(కలెక్టరేట్‌), అక్టోబరు 16: ఒంగోలులోని రంగారాయుడు చెరువు వాకింగ్‌ ట్రాక్‌తో పాటు చెరువును అభివృద్ధి చేసేందుకు శ్రీకా రం చుడుతున్నట్టు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఆ డివిజన్‌ కార్పొరేటర్‌ ఢాకా సుజాత, హనుమారెడ్డిల నేతృత్వంలో శ ని వారం మేయర్‌ గంగాడ సుజాత, మునిసిపల్‌ అధికారులతో కలిసి చె రువు కట్టను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ  తాగునీటి కి ఇబ్బంది  లేకుండా తన తండ్రి బాలినేని వెం కటేశ్వరరెడ్డి జ్ఞాపకార్థం సొంత నిధులతో ఆర్వో ప్లాంటు ఏర్పాటుచే స్తామన్నారు. అనంతరం రంగారాయుడు చెరువు కట్టపై పలురకాల పూలమొక్కలను  నాటారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ వేమూరి సూర్యనారాయణ, కమిషనర్‌ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

24వరకు చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు

ఒంగోలు (కల్చరల్‌), అక్టోబరు 16: స్థానిక కేశవస్వామిపేట శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభమై ఈనెల 24వరకు జరుగుతాయని దేవస్థాన పాలకమండలి చైర్మన్‌ ఈదుపల్లి గురునాథరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాన్ని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి శనివారం ఆయన నివాసంలో ఆవిష్కరించారు.  

ఘనంగా రాజరాజేశ్వర దేవస్థాన పాలకమండలి ప్రమాణం

ఒంగోలు (కల్చరల్‌), అక్టోబరు 16: స్థానిక కొత్తపట్నం బస్టాండు సెంటర్‌లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.   చాకిరి ధనుంజయ ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయగా, పాలక మండలి సభ్యులుగా ఏడుగురు ప్రమాణ స్వీకారం చేశారు.