అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2022-08-10T04:39:00+05:30 IST

అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.

అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు
మహిళతో మాట్లాడుతున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

వెంకటాచలం, ఆగస్టు 9  : అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కనుపూరులో మంగళవారం సాయంత్రం చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సందర్భంగామంత్రి  ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా తెలుసుకుంటూ, ఏమైనా సమస్యలు  ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొందరికే అందేవని, సీఎంగా జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాకే అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. సాంకేతిక కారణాలతో అర్హత ఉండి కూడా సంక్షేమ పథకాలు అందని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే తన లక్ష్యమన్నారు. ఆయన వెంట తహసీల్దారు నాగరాజు, ఎంపీడీవో సుస్మిత, సర్పంచ్‌ నాటకం శ్రీనివాసులు, ఎంపీటీసీ పీ.మస్తానయ్య, ఉప సర్పంచ్‌ సీహెచ్‌ ప్రభాకర్‌, మాజీ జడ్పీటీసీ వెంకటశేషయ్య, వివిధ శాఖల అధికారులు, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 

చేజర్ల, ఆగస్టు 9: ప్రభుత్వం పేదరికమే అర్హతగా సంక్షేమ  పథకాలు ప్రజలందరికీ అందేలా పాలన సాగిస్తోందని ఆత్మకూరు  ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. మండలంలోని కాకివాయి గ్రామంలో మంగళవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికే త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అనంతరం  గడప గడపకు తిరిగి సంక్షేమ పధకాలు అందుతున్నాయా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. లంచం లేనిదే ఏ పనీ కావడం లేదని రైతులు ఫిర్యాదు చేశారు.  వెంటనే అక్కడ ఉన్న డీటీని మళ్లీ ఇటువంటి ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలిరెడ్డి రమాదేవి, జడ్పీటీసీ పార్ధసారధి, స్ధానిక నాయకులు నాగిరెడ్డి, సుందరయ్య, తిరపతిరెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2022-08-10T04:39:00+05:30 IST