వైభవంగా లక్ష్మీనృసింహుల కల్యాణం

ABN , First Publish Date - 2022-05-17T06:19:36+05:30 IST

మండలంలోని వెంకటాపూర్‌ గ్రామంలో వేంకటగిరి లక్ష్మీనృసింహుడి కల్యాణోత్సవాన్ని సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

వైభవంగా లక్ష్మీనృసింహుల కల్యాణం
వేంకటగిరి లక్ష్మీనృసింహుల కల్యాణతంతు నిర్వహిస్తున్న అర్చకులు

 తుర్కపల్లి, మే 16: మండలంలోని వెంకటాపూర్‌ గ్రామంలో వేంకటగిరి లక్ష్మీనృసింహుడి కల్యాణోత్సవాన్ని సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట అనుబంధ క్షేత్రమైన మండలంలోని వెంకటాపూర్‌ గ్రామంలోని వేంకటగిరి కొండ కింద ఏర్పాటు చేసిన మండపంలో ముస్తాబైన కల్యాణ వేదికపై వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల మధ్య లక్ష్మీనరసింహుల కల్యాణ తంతు వైభవంగా జరిగింది. కల్యాణానికి ముందు స్వామి వారు గజ వాహనంపై గ్రామ పురవీధులన్నీ విహరించి కల్యాణ వేదిక వద్దకు వచ్చారు. కాగా యాదగిరిగుట్ట దేవస్థానం తరుపున వంశపారంపర్య ధర్మకర్త నర్సింహమూర్తి తలంబ్రాలు, పట్టువసా్త్రలు అందజేశారు.  స్వామి అమ్మవార్లకు రక్షాసూత్రధారణ గావించిన పూజారులు వేద ప్రాశస్త్యమైన మంత్రోచ్ఛరణలతో స్వామికి యజ్ఞోపవీత్రధారణ తంతు జరిపారు. దేవదేవుడు నృసింహుడికి లక్ష్మీ అమ్మవారి తండ్రి సముద్రుడు పాద ప్రక్షాళన చేసిన అనంతరం కన్యాదాన తంతును గావించారు. మహోత్సవ కల్యాణ వేడుకల్లో వధూవరులు నరసింహుడు, మహాలక్ష్మీ అమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర, బెల్లం అలంకరించే కార్యక్రమం ఆగమశాస్త్ర రీతిలో సాగింది.  కల్యాణ వేడుకల విశిష్టతను దేవస్థానం వంశపారంపర్య పురోహితుడు వి.రమాకాంతశర్మ భక్తులకు తెలియజేశారు. కల్యానోత్సవం అనంతరం భక్తుజనులంతా కల్యాణ మూర్తులకు ఒడి బియ్యం సమర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ సన్నిధిలో భక్తులకు దాత కల్లూరి రాంచంద్రారెడ్డి సహకారంతో అన్నదానం చేశారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట దేవాస్థానం ఏఈవో రమేశబాబు, సర్పంచ కల్లూరి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ భూక్య సుశీలరవీందర్‌నాయక్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డి, మాజీ ఎంపీపీ భూపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి వివిధగ్రామాల సర్పంచలు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. 

ఘనంగా వేణుగోపాలస్వామి కల్యాణం

గుండాల : మండలంలోని సుద్దాల గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి కల్యాణాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సేవాకాలం, ప్రాభోది, తీర్థ ప్రసాదాలు, నిత్య హోమం, బలిహరణ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సనీగేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్‌తేజ, ప్రభుత్వ వాస్తు సలహాదారుడు సుధాకర్‌తేజ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ప్రతాపురం వెంకటశేషా చార్యులు, వేప నర్సింహ మూర్తి కల్యాణాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ గూడ ఉపేంద్రరవీందర్‌ గౌడ్‌, ఉపసర్పంచు బత్తిని రవి, తహసీల్దార్‌ శ్రీనివా్‌సరాజ్‌, ఎస్‌ఐ సందీ్‌పకుమార్‌,  జడ్పీ మాజీ వైస్‌ చైర్మన గడ్డమీది పాండరి, యూత కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు గూడ మధుసూధనగౌడ్‌, గూడ రాజబోసు, నాయిని కృష్ణ్ణారెడ్డి, వై.వేణుగోపాల్‌రెడ్డి, ఏ.రాజు, బడక మల్లయ్య, కె.మధు, బడక వెంకన్న, రాంరెడ్డి, దంతూరి మల్లయ్య పాల్గొన్నారు.

 చెన్న కేశవస్వామి గుట్టపై ధ్వజారోహనం 

వలిగొండ: మండలంలోని అరూరు గ్రామంలో శ్రీ భూనీలగోద సమేత చెన్న కేశవస్వామి వార్షిక అధ్యయన మహోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం ధ్వజారోహనం ఘనంగా నిర్వహించారు.  స్వామివారి గుట్ట చుట్టూ ఫలహారాల బండ్లతో ప్రదక్షణం చేసి ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచి పెట్టి భక్తులు తమ మొక్కును చెల్లించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకన్నారు. కార్యక్రమంలో అర్చకులు రాజు, శశి పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-17T06:19:36+05:30 IST