కల్యాణం.. కమనీయం

ABN , First Publish Date - 2022-05-17T04:29:45+05:30 IST

నారాయణపేట రాఘ వేంద్రస్వామి ఆలయంలో సోమవారం లక్ష్మీ నరసింహా స్వామి కల్యాణాన్ని రఘుప్రేమ్‌ జోషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

కల్యాణం.. కమనీయం
పేటలో రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

- భక్తజన సందోహం మధ్య కొనసాగిన లక్ష్మీ నరసింహస్వామి ర థోత్సవం

నారాయణపేట, మే 16 : నారాయణపేట రాఘ వేంద్రస్వామి ఆలయంలో సోమవారం లక్ష్మీ నరసింహా స్వామి కల్యాణాన్ని రఘుప్రేమ్‌ జోషి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు సామూహిక వ్రతాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భజన, పల్లకీ సేవ, మహా రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకుడు నర్సింహాచారి, రాఘవేంద్ర సేవా సమితి స భ్యులు రఘుప్రేమ్‌, శ్రీపాద్‌, అనంత రావు, భీంసేన్‌, శ్రీపతి, శేషు, రవి, ప్రకాష్‌, ప్రసాద్‌, రవితేజ, మాణి క్‌ శాస్ర్తీ, ధరణి, మంజునాథ్‌, అజయ్‌ పాల్గొన్నారు.

మాగనూరు : మండల కేంద్రంలో వెలసిన లక్ష్మీ నరసింహాస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం స్వామి వారికి పురోహితులు కనుల పండువగా కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాల్గొనగా, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి తమ కార్యకర్తలచే ముత్యాల తలంబ్రాలను పంపించారు. స్వామి వారికి గిన్నె సులోచనమ్మ మోహన్‌రెడ్డి దంపతులు రూ.1.50 లక్షలతో మూడు నామాల బంగారు వస్తువును బహుకరించారు. అంతకు ముందు తెల్లవారుజామున స్వామివారి ప్రభ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం చలి వేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచు రాజు, ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాసులు, జైపాల్‌రెడ్డి, కృష్ణయ్య, పురుషోత్తంరెడ్డి, బాబుగౌడ్‌, ఆంజనేయులు, గడ్డం నరేష్‌, ఆర్యవైశ్య సంఘం కమిటీ అధ్యక్షుడు ఉదయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

జడ్పీ చైర్‌పర్సన్‌ పూజలు

నారాయణపేట టౌన్‌ : నారాయణపేట సింగార్‌ బేస్‌ హనుమాన్‌ ఆలయంలో సోమవారం జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ ప్రత్యేక పూజలు చేసి  అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ గురులింగప్ప, జడ్పీ సీఈవో సిద్రామప్ప, డిప్యూటీ సీఈవో జ్యోతి, అఖిల భారత అయ్యప్పదీక్ష ప్రచార సమితి జిల్లా అధ్యక్షుడు కాకర్ల భీమయ్య, వెంకటేష్‌, పరంధాములు, సత్యనారాయణ, విజయ్‌, అర్చన, హేమలత  పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T04:29:45+05:30 IST