Abn logo
Sep 25 2021 @ 00:38AM

సంక్షేమ ఫలాలే గెలుపు బాటలు : డీప్యూటీ సీఎం

ఎంపీపీ సిద్ధిక్‌, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్యేను గజమాలతో సత్కరిస్తున్న దృశ్యం

ఖాజీపేట, సెప్టెంబరు 24: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ ఫలాలు గడపగడపకూ వెళ్లాయని, దీంతో ప్రజలు ఒకే తీర్పు అందించి గెలుపునకు బాటలు వేశారని డిప్యూటీ సీఎం అంజాద్‌బాష పేర్కొన్నారు. ఖాజీపేట మండలాభివృద్ధి కార్యాలయంలో ఎంపీపీగా అబూబకర్‌ సిద్ధిక్‌, ఉపమండలాధ్యక్షురాలిగా ప్రశాంతి, కోఆప్షన్‌ మెంబర్‌గా మున్వర్‌హుస్సేన్‌ను ఎంపీటీసీలు బలపరిచగా వారితో ఎన్నికల అధికారి వెంకటరమేష్‌, ఎంపీడీఓ మైధిలి ప్రమాణం చేయించారు.

ఖాజీపేట మండల ప్రజలకు సదుపాయాలు కల్పించడం, మండల అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీపీ అబూబాకర్‌ సిద్ధిక్‌ తెలిపారు. సహకరించిన వారందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎస్‌.రఘురామిరెడ్డి, మైదుకూరు సమన్వయకర్త నాగిరెడ్డి ఏపీఐఐసీ రాష్ట్ర డైరెక ్టర్‌ డి.గంగాధర్‌రెడి ్డ, అచ్చుకట్ల కరీముల్లా, బీఎంబీ రాఘవరెడి ్డ,రాజేశ్వరరెడి ్డ తదితరులు పాల్గొన్నారు.

పోరుమామిళ్ల, సెప్టెంబరు 24: మండలాన్ని ఆదర్శవంతంగా తీర్చుదిద్దుతానని పోరుమామిళ్ల మండల అధ్యక్షురాలు చాంద్‌బాయిగారి తహసీమ్‌ అన్నారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో నోడల్‌ఆఫీసర్‌ వెంకటసుబ్బారావు ఆమె చేత ప్రమాణం చేయించారు. మండల ఉపాధ్యక్షుడిగా సీఎం.బాష ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మహ్మద్‌ అలీఖాన్‌, ఎంపీడీఓ నూర్జహాన్‌ పాల్గొన్నారు. కార్యక్రమానికి ముం దు నిర్వహించిన ర్యాలీలో బద్వేలు మార్కెట్‌యార్డ్‌ వైస్‌చైర్మన్‌ రమణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డీసీ.గోవిందరెడ్డి, మాజీ జడ్పీటీసీ దేశాయి శారదమ్మ, నేతలు ఆదిత్యరెడ్డి, సీఎం బాష, చుక్కా రవిప్రకా్‌షరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

 దువ్వూరు, సెప్టెంబరు 24: ఎంపీడీఓ కార్యాలయంలో మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా కానాల జయచంద్రారెడ్డి రెహన్నీసాతో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నాగరాజు ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శెట్టిపలె ్ల రఘురామిరెడి ్డ, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ ఇరగంరెడ్డి తిరుపాల్‌రెడి ్డ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్‌ అంబటి కృష్ణారెడి ్డ, జడ్పీటీసీ సభ్యుడు మేరువ కృష్ణయ్య, ఎంపీడీఓ జగదీశ్వర్‌రెడి ్డ, తహసీల్దారు దామోదర్‌రెడి ్డ, సర్పంచులు మంచాల రాజగోపాల్‌రెడి ్డ, రాజుపాళెం మహబూబ్‌షరీఫ్‌, చండ్రాయుడు, సుబ్బారెడ్డి, చంద్రహాసరెడ్డి, మండల వైసీపీ నేతలు పాల్గొన్నారు. మైనార్టీ వర్గానికి మండల ఉపాధ్యక్షుని పదవి రావడంపట్ల వైసీపీ మండల మైనార్టీ నాయకులు పీరూజాదా, షాకీర్‌హుస్సేన్‌, మాజీ కోఆప్షన్‌ సభ్యుడు అట్టావుల్లా, ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని సత్కరించారు.   

సింహాద్రిపురం, సెప్టెంబరు 24: సింహాద్రిపురం మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా కాసుల అరుణ, శ్రీకాంత్‌రెడ్డితో ఎన్నికల అధికారి ప్రభాకర్‌ రెడ్డి, ఎంపీడీఓ కృష్ణమూర్తి ప్రమాణం చేయించారు. సభ్యుల ను వైసీపీ తాలూకా ఇన్‌చార్జ్‌ వైఎస్‌ మనోహర్‌రెడ్డి, మండల వైసీపీ ఇన్‌చార్జ్‌ శివప్రకాష్‌రెడ్డి, వైసీపీ నేత దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అభినందించారు. మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా కాసుల అరుణ, శ్రీకాంత్‌రెడ్డిలను జడ్పీటీసీ బి.ఎన్‌.ఝాన్సీరాణి, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బిఎన్‌ బ్రంహ్మానందరెడ్డి శాలువ, బోకేలతో సన్మానించారు. 

బి.కోడూరు, సెప్టెంబరు 24: బి.కోడూరు మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు గా కోడూరు చెన్నమ్మ, దాదన శేఖర్‌రెడ్డితో స్పెషల్‌ ఆఫీసర్‌ బ్రహ్మయ్య, ఎంపీడీఓ ఉమామహేశ్వర్‌రావ్‌ ప్రమాణం చేయించారు. మండల కన్వీనర్‌ యోగానందరెడ్డి, సింగల్‌విండో అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కాయకుంట్ల సర్పంచ్‌ ముక్కమాల నర్సమ్మ, ఉపసర్పంచ్‌ కొమ్మూరు ఈశ్వరమ్మ, రమణ, నరసింహ, ప్రజలు ఎంపీపీ కోడూరు చెన్నమ్మను, ఉపమండలాధ్యక్షుడు దాదన శేఖర్‌రెడ్డి సత్కరించారు. 

వేంపల్లె, సెప్టెంబరు 24: వేంపల్లె మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే ధ్యేయమని మం డలాధ్యక్షు రాలిగా ఎంపికైన గాయత్రి పేర్కొన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీటీసీలు, ఎంపీపీ, మండల ఉపాధ్యక్షులు ప్రమాణం చేశారు. కార్యక్ర మంలో జడ్పీటీసీ రవికుమార్‌ రెడ్డి, వైసీపీ కన్వీనర్‌ చంద్ర ఓబుళరెడ్డి, ఉపాధ్యక్షురాలు రవణమ్మ తదిత రులు పాల్గొన్నారు.

చక్రాయపేట, సెప్టెంబరు 24: చక్రాయపేట మండ లాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే ధ్యేయమని మండలా ధ్యక్షురాలిగా ఎంపికైన ఎం మాధవి పేర్కొన్నా రు.  ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీటీసీలు, ఎంపీపీ, మండల ఉపాధ్యక్షులతో స్పెషలాఫీసర్‌ మురళీధర్‌రెడ్డి ప్రమాణం చేయించారు. ఈ పదవి ఇచ్చిన ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, వైఎస్‌ కొండారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్ర మంలో జడ్పీటీసీ శివారెడ్డి, ఎంపీడీఓ హైదర్‌ అలి, సమ న్వయకర్త ఓబుళరెడ్డి, ఏపీటూరిజం మెంబర్‌ బెల్లం ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి, సభాపతి నాయుడు, స్వామి, సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకట సుబ్బ య్య, మండల ఉపాధ్యక్షుడు భైరవమూర్తి, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు.

కాశినాయన సెప్టెంబరు 24: అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవమైంది. వైసీపీ మండల కన్వీనర్‌ నల్లేరు విశ్వనాధ్‌రెడ్డి తల్లి పోలమ్మను అధ్యక్షురాలిగా, కత్తెరగండ్ల వెంకటసుబ్బయ్య ఆచారిని ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రత్యేకాధికారి బ్రహ్మానందరెడ్డి అధ్యక్ష, ఉపాధ్యక్షులతో ప్రమాణం చేయించారు. మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ప్రసంగించారు. తహసీల్దారు రవిశంకర్‌, ఎంపీడీఓ ముజఫర్‌ రహీం, జడ్పీటీసీ సత్యనారాయణరెడ్డి, సర్పంచులు ప్రభాకర్‌రెడ్డి, బి.పిచ్చిరెడ్డి, ఎం.రాజనారాయణరెడ్డి, ఎంపీటీసీ భాస్కర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ రామసుబ్బారెడ్డి పాల్గొన్నారు.

పోరుమామిళ్లలో నిర్వహిస్తున్న విజయోత్సవ ర్యాలీ