రామరథ యాత్రకు ఘనస్వాగతం

ABN , First Publish Date - 2020-09-24T08:50:13+05:30 IST

తమిళనాడు రాష్ట్రం రామేశ్వరానికి చెందిన భక్తురాలు జయలక్ష్మి చేపట్టిన రామ రథయాత్ర బుధవారం పట్టణానికి చేరు కుంది.

రామరథ యాత్రకు ఘనస్వాగతం

పెనుకొండ, సెప్టెంబరు 23: తమిళనాడు రాష్ట్రం రామేశ్వరానికి చెందిన భక్తురాలు జయలక్ష్మి చేపట్టిన రామ రథయాత్ర బుధవారం పట్టణానికి చేరు కుంది. ఆమె సొంత ఖర్చులతో తయారు చేయించిన 613 కేజీ ల గంటతోపాటు రామలక్ష్మణ సీత, హనుమంతుడి విగ్రహాల ను అయోధ్య రామమందిరానికి సమర్పించడానికి ఈనెల 17న యాత్రను ప్రారంభించారు.


బుధవారం మధ్యాహ్నం పెనుకొండకు చేరుకున్న రథానికి స్థానిక బీజేపీ, విశ్వహిందూపరిషత్‌, బ్రాహ్మణ, ఆర్యవైశ్య సంఘం నాయకులు, పురప్రజలు, స్థానిక వైజంక్షన్‌వద్ద ఘన స్వాగతం పలికారు. గంట, రామలక్ష్మణ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేయించారు. గంటను తయారు చేయించిన భక్తురాలు జయలక్ష్మీ మాట్లాడుతూ అయోధ్యలోని రామజన్మభూమిలో నిర్మిస్తున్న ఆలయానికి తనవంతు సాయంగా దీనిని సమర్పిస్తున్నట్లు తెలియజేశారు.


రామేశ్వరం నుంచి అయోధ్యకు 4550 కిలోమీటర్ల దూరాన్ని స్వయంగా వాహనాన్ని నడుపుతూ రామాలయంలో సమర్పిస్తానన్నారు. అక్టోబరు 7న వీటిని అందజేస్తానన్నారు. 

Updated Date - 2020-09-24T08:50:13+05:30 IST