చంద్రబాబుకు అఖండ స్వాగతం పలుకుదాం: బీకే

ABN , First Publish Date - 2022-05-17T06:16:16+05:30 IST

సోమందేపల్లిలో ఈనెల 20న నిర్వహిస్తు న్న ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి హాజరవుతున్న టీడీపీ అధి నేత నారా చంద్రబాబు నాయుడుకు అఖండ స్వాగతం పలుకుదా మని పార్టీ శ్రేణులకు హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు బీకే పార్థసారథి పిలుపునిచ్చారు.

చంద్రబాబుకు అఖండ స్వాగతం పలుకుదాం: బీకే
పెనుకొండలో మాట్లాడుతున్న బీకే పార్థసారథి

పెనుకొండ, మే 16: సోమందేపల్లిలో ఈనెల 20న నిర్వహిస్తు న్న ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి హాజరవుతున్న టీడీపీ అధి నేత నారా చంద్రబాబు నాయుడుకు అఖండ స్వాగతం పలుకుదా మని పార్టీ శ్రేణులకు హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు బీకే పార్థసారథి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో మండలస్థాయి కార్యకర్తలతో చంద్రబాబు పర్యటనపై ఆ యన సమావేశమై మాట్లాడారు. చంద్రబాబు పర్యటనలో దాదా పు 30 వేల నుంచి 40 వేల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. కార్యక్రమానికి వచ్చే ప్రతిఒక్కరికీ అన్ని సౌకర్యాలు క ల్పించాలన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని మంచినీరు, మజ్జిగ పంపిణీ చేయాలన్నారు. సమావేశంలో హిందూపురం పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి మునిమడుగు వెంక టరాముడు, కన్వీనర్‌ శ్రీరాములు, నాయకులు సిద్దయ్య, పోతిరెడ్డి, పాలడుగు చంద్ర, హుజురుల్లాఖాన, సుబ్బరాయుడు, నాగరాజు, వెంకటగిరిపాళ్యం శ్రీనివాసులు, సిద్దయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. 


కార్యకర్తలు తరలిరావాలి

హిందూపురం టౌన: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమందేపల్లి పర్యటనకు ప్రతి మండలం నుంచి నాయకులు, కా ర్యకర్తలు తరలిరావాలని నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం స్థానికంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసంలో నిర్వహిం చిన కార్యకర్తల సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఈనెల 20న సోమందేపల్లిలో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమానికి చంద్రబా బు హాజరవుతున్నట్లు తెలిపారు. హిందూపురం నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన, ప్రజావ్యతిరేక విధానాలపై సమరశంఖం పూరించాలన్నారు. విద్యుత, ఆర్టీసీ చార్జీలతో పాటు పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసరాల ధరలు పెంచి ప్రభుత్వం పేదలపై పెను భారం మోపుతోందన్నారు. కార్యక్రమంలో తెలుగుదే శం నాయకులు అంబికా లక్ష్మీనారాయణ, ఆర్‌ఎంఎస్‌ షఫీ, కొల్లకుంట అంజినప్ప, మండల కన్వీనర్లు అశ్వర్థనారాయణరెడ్డి, రంగారెడ్డి, నాయకులు భాస్కర్‌, పరిమళ, అమర్‌నాథ్‌, నజీర్‌, సతీ ష్‌, కొడికొండ బాలాజీ, శ్రీదేవి, చెన్నమ్మ, నబీరసూల్‌, గీత, విజయలక్ష్మీ, మంజునాథ్‌, రామక్రిష్ణారెడ్డి, నాగలింగారెడ్డి, మారుతిప్రసాద్‌, విశ్వనాథ్‌రెడ్డి, ప్రెస్‌ వెంకటేశ, నాగరాజు, తిమ్మయ్య, నాగేంద్ర, నరేంద్ర, నవీన, మల్లికార్జున, హరీష్‌ పాల్గొన్నారు.  


Updated Date - 2022-05-17T06:16:16+05:30 IST