ఆ ఒక్కటీ అడగొద్దు: కేంద్ర మంత్రి తోమర్

ABN , First Publish Date - 2021-06-19T00:54:06+05:30 IST

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నవంబర్ 25న ప్రారంభమైన ఈ ఆందోళన నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ విషయమై ప్రభుత్వానికి రైతు సంఘాలకు మధ్య 11 విడతల చర్చలు జరిగాయి. అయితే ఆ చర్చలు అటు ప్రభుత్వానికి

ఆ ఒక్కటీ అడగొద్దు: కేంద్ర మంత్రి తోమర్

న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల విషయమై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం తరపున రైతు సంఘాలను చర్చలకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆహ్వానం పలికారు. అయితే ఇందులో ఆయన ఒక కిటుకు పెట్టారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించడం మినహా మరే ప్రతిపాదనైనా వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఆయన తేల్చి చెప్పారు.


‘‘రైతులతో మాట్లాడడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఏ రైతు అయినా, ఏ రైతు సంఘమైనా ప్రభుత్వంతో నేరుగా చర్చలు చేయొచ్చు. అయితే ఒక్క మాట.. వ్యవసాయ చట్టాల్ని ఉపసంహరించుకోవడం మినహా మరే ప్రతిపాదన అయినా ప్రభుత్వంతో చర్చించవచ్చు. అలాంటి ప్రతిపాదనలు, ప్రశ్నలను స్వాగతిస్తాం’’ అని కేంద్ర మంత్రి తోమర్ అన్నారు.


వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ నవంబర్ 25న ప్రారంభమైన ఈ ఆందోళన నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఈ విషయమై ప్రభుత్వానికి రైతు సంఘాలకు మధ్య 11 విడతల చర్చలు జరిగాయి. అయితే ఆ చర్చలు అటు ప్రభుత్వానికి కానీ, ఇటు రైతులకు గానీ ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.

Updated Date - 2021-06-19T00:54:06+05:30 IST