Sanket Sargar: కామన్వెల్త్‌లో భారత్ బోణీ.. రజతం సాధించిన వెయిట్‌లిఫ్టర్ సంకేత్ సర్గర్

ABN , First Publish Date - 2022-07-30T22:07:56+05:30 IST

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ దూకుడు కొనసాగుతోంది. తొలి రోజు నుంచే ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తున్న భారత

Sanket Sargar: కామన్వెల్త్‌లో భారత్ బోణీ.. రజతం సాధించిన వెయిట్‌లిఫ్టర్ సంకేత్ సర్గర్

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ దూకుడు కొనసాగుతోంది. తొలి రోజు నుంచే ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తున్న భారత అథ్లెట్లు రెండో రోజు భారత్‌కు తొలి పతకం అందించారు. వెయిట్‌లిఫ్టర్ సంకేత్ సర్గర్(Sanket Sargar) 55 కేజీల పురుషుల విభాగంలో రజతం సాధించి పతకాల పట్టికలో భారత్‌ను చేర్చాడు. ఒక్క కేజీ తేడాతో స్వర్ణం కోల్పోయి రజతంతో సరిపెట్టుకున్నాడు. క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో తొలి ప్రయత్నంలో 135 కిలోలు ఎత్తిన సంకేత్.. రెండు, మూడు ప్రయత్నాల్లో 139 కేజీలు ఎత్తడంలో విఫలమయ్యాడు. స్నాచ్‌లో మూడో ప్రయత్నంలో ఏకంగా 113 కేజీలు ఎత్తాడు. మొత్తంగా 248 కేజీలు ఎత్తి ఒక్క కేజీ తేడాతో సంకేత్ స్వర్ణం కోల్పోయాడు. మహ్మద్ అనిక్ బిన్ కస్దాన్ (Mohamad Aniq bin Kasdan) మొత్తంగా 249 కేజీలు ఎత్తి ఒక్క కేజీ తేడాతో పసిడి పతకం సాధించాడు.  


మరోవైపు, స్విమ్మర్ శ్రీహరి నటరాజ్(Srihari Nataraj) సెమీఫైనల్‌ బ్యాక్‌స్ట్రోక్‌‌ 100 మీటర్ల విభాగంలో 54.55 సెకన్లలో పూర్తి చేసి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నాడు. 21 ఏళ్ల నటరాజ్ సెమీస్‌ను తన హీట్‌లో నాలుగో స్థానంలో ముగించాడు. ఓవరాల్‌గా ఏడో స్థానంలో నిలిచి పతక పోరుకు అర్హత సాధించాడు. ఆదివారం జరగనున్న ఫైనల్  పోరులో భారత్‌కు పతకం అందించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆదివారం జరిగే ఫైనల్స్‌లో నటరాజ్ విజయం సాధిస్తే కామన్వెల్త్‌లో ఆ ఘనత సాధించిన రెండో భారత స్విమ్మర్‌గా రికార్డులకెక్కుతాడు.  

Updated Date - 2022-07-30T22:07:56+05:30 IST