Sanket Sargar: కామన్వెల్త్ పతకాన్ని భారత సైన్యానికి అంకితమిచ్చిన సంకేత్

ABN , First Publish Date - 2022-07-31T00:48:48+05:30 IST

కామన్వెల్త్ గేమ్స్‌ (Commonwealth Games)లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన వెయిట్‌లిఫ్టర్ సంకేత్

Sanket Sargar: కామన్వెల్త్ పతకాన్ని భారత సైన్యానికి అంకితమిచ్చిన సంకేత్

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌ (Commonwealth Games)లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన వెయిట్‌లిఫ్టర్ సంకేత్ సర్గర్ (Sanket Sargar) తన పతకాన్ని భారత సైన్యానికి అంకితమిచ్చాడు. 55 కేజీల విభాగంలో 248 కేజీలు ఎత్తి ఒక్క కేజీ తేడాతో స్వర్ణం కోల్పోయిన సంకేత్.. తన ప్రదర్శనపై కొంత అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. అంచనాలకు మించి రాణించలేకపోయానని పేర్కొన్న సంకేత్.. క్లీన్ అండ్ జెర్క్‌లో నిరాశపరిచాడు. ఫలితంగా పసిడి సాధించే అవకాశాన్ని కోల్పోయాడు. అయితే, రజత పతకం సాధించడం కొంత ఆనందంగానే ఉందని పేర్కొన్నాడు. 


క్లీన్ అండ్ జెర్క్‌లో రెండుసార్లు విఫలం కావడం సంకేత్ పసిడి ఆశలను నేలపాలు చేశాయి. మొత్తం 248 కేజీలు (113+135 కేజీలు) ఎత్తి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మలేషియాకు చెందిన మహమ్మద్ అనిక్ 249 కేజీలు ఎత్తి ఒక్క కేజీ తేడతో స్వర్ణం ఎగరేసుకుపోయాడు. శ్రీలంకకు చెందిన  దిలంక ఇసురు కుమార 225 కేజీలు ఎత్తి కాంస్యం సొంతం చేసుకున్నాడు.   

Updated Date - 2022-07-31T00:48:48+05:30 IST